బిగ్ బాస్ తెలుగు 6వ(Bigg Boss 6 Telugu) సీజన్ ఆదివారంతో ముగిసింది. 105 రోజులపాటు జరిగిన షో ఎట్టకేలకు ముగింపు పెద్ద ట్విస్ట్ తో క్లోజ్ అయ్యింది. టాప్ 5గా ఉన్న రేవంత్(Revanth), శ్రీహాన్(Srihan), ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్‌లలో ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్‌గా రేవంత్ నిలిచారు. ముందు నుంచి ఊహించినట్టుగానే, ఆడియెన్స్ అభిప్రాయం ప్రకారంగానే రేవంత్ విన్నర్ అయ్యాడు. కానీ అందులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. ఓటింగ్ ప్రకారం శ్రీహాన్‌కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున(Nagarjuna).