ఆఫర్‌కి టెంప్ట్ అయి తప్పుచేసిన శ్రీహాన్.. బిగ్‌ బాస్‌ 6లో ఆయనకు దక్కే మొత్తం ఎంతంటే? గట్టిగానే కొట్టేశాడుగా!

First Published Dec 18, 2022, 10:48 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తూ సాగింది. హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తూ సాగింది. హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇవీరిలో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ముందుగా రోహిత్, ఆ తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు. 

చివరకి రేవంత్, శ్రీహాన్ మిగిలారు. వీరిద్దరిలో విజేత ఎవరు అనే ఉత్కంఠ చాలా సేపు కొనసాగింది. నాగార్జున వీరిద్దరికి డబ్బు ఎరగా వేశారు. 25 లక్షల నుంచి బేరం మొదలు కాగా.. రేవంత్, శ్రీహన్ ఎక్కడా టెంప్ట్ కాలేదు. వారంతట వారే పోటీ నుంచి తప్పుకుంటే 30 లక్షల ఆఫర్ అని ప్రకటించినా రేవంత్, శ్రీహన్ అంగీకరించలేదు. 

కానీ నాగార్జున ఒక్కసారిగా 40 లక్షల ఆఫర్ ప్రకటించడంతో ఇద్దరిలో ఆలోచన మొదలయింది. ఎందుకంటే విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. దానితో పోల్చుకుంటే 40 లక్షలు చిన్నఅమౌంట్ కాదు. దీనితో సంచలనాత్మకంగా బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి అంగీకరించాడు. దీనితో రేవంత్ కి విజయం దక్కింది. 

ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. అసలు విజేత శ్రీహాన్. ప్రేక్షకుల ఓట్లు రేవంత్ కంటే కాస్త ఎక్కువగా శ్రీహాన్ కి వచ్చాయట. శ్రీహాన్ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, 40 లక్షలకు టెంప్ట్ కాకుండా ఉండి ఉంటె విజేతగా నిలిచేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్కింది. 

శ్రీహాన్ పరోక్షంగా రేవంత్ ని విజేతగా నిలబెట్టినట్లు అయింది. గత సీజన్స్ లో కూడా ఇలాంటి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఏ హౌస్ మేట్ కూడా ఆఫర్ కి అంగీకరించలేదు. శ్రీహాన్ తొందరపాటు నిర్ణయం తీసుకుని పప్పులో కాలేశాడు. ఏది ఏమైనా డబ్బు పరంగా ఇద్దరికీ పెద్ద తేడా లేదనే చెప్పాలి. 

శ్రీహాన్ పొరపాటుగా రన్నరప్ గా నిలిచాడు. అయినప్పటికీ అతడి ఖాతాలో పెద్ద అమౌంట్ చేరుతోంది. రన్నరప్ ప్రైజ్ మనీ ద్వారా శ్రీహాన్ 40 లక్షలు అందుకోనున్నారు. అలాగే బిగ్ బాస్ లో శ్రీహాన్ కి రోజుకి 30 వేల వరకు రెమ్యునరేషన్ ఉంటుంది. ఈ లెక్కన మరో 30 లక్షలు శ్రీహాన్ కి దక్కుతాయి. మొత్తంగా శ్రీహాన్ బిగ్ బాస్ 6 తో దాదాపు 70 లక్షల పైనే ఖాతాలో వేసుకున్నాడు. ఏదేమైనా నాగార్జున ఆఫర్‌ కి టెంప్ట్ అయి శ్రీహాన్‌ చాలానే మిస్‌ అయ్యాడు. ఆయన టెంప్ట్ కాకపోయి ఉంటే యాభై లక్షల ప్రైజ్‌ మనీ, ట్రోఫీతోపాటు 30లక్షల ఫ్లాట్‌, పది లక్షల కారు, రెమ్యూనరేషన్‌ కలుపుకుని ఆయనకు సుమారు కోటీ ఇరవై లక్షల వరకు దక్కేది. కానీ బ్యాడ్‌ లక్. బట్‌ ఆడియెన్స్ మనసులో మాత్రం అసలైన విన్నర్‌గా నిలిచారు శ్రీహాన్‌.

click me!