పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం సంచలనంగా మారింది. దీని గురించి సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకులు తీసుకుని విడిపోవడంతో సోషల్ మీడియాలో ఇదే టాపిక్ ట్రెండింగ్ గా మారింది. సినీ, రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే నందిని, రేణు దేశాయ్ లతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు అన్నా లెజినోవా నుంచి కూడా విడిపోయారు. ఈ తరుణంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన సంచలన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
24
రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్
పవన్ కళ్యాణ్ విడాకుల న్యూస్ బయటకు వచ్చిన తర్వాత రేణు దేశాయ్ ఇలాంటి పోస్ట్ పెట్టడం ఆసక్తిగా మారింది. ఇంతకీ రేణు దేశాయ్ ఎలాంటి కామెంట్స్ చేసిందో ఇప్పుడు చూద్దాం. 'ఒక వ్యక్తి కష్టంలో ఉంటే వాళ్ళని ఇంకా దూషించడం ధర్మం కాదు. ఆల్రెడీ కింద పడిపోయిన వాళ్ళని తొక్కడం అమానుషం. వాళ్ళు ఏస్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక మనిషే.. ఒకరి బిడ్డే, ఒకరి సోదరుడే, ఒకరికి పేరెంటే అనే సంగతి మరచిపోకూడదు.
34
మీరు ఉండేది కూడా అద్దాల మేడలోనే..
దయచేసి అవతలివాళ్లు ఇళ్లపై రాళ్లు వేయకండి.. ఎందుకంటే మీరు ఉంటున్నది కూడా పగిలిపోయే అద్దాల మేడలోనే అనే సంగతి గుర్తుంచుకోండి. మనం అందరం మనుషులం. జాలి దయ అనేవి మనుషులకు ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలు. ఒక సమాజంగా మనం మెరుగ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేస్తున్నా.
దయచేసి దీనిపై మీరు స్టుపిడ్ గా ఉహాగానాలు చేయొద్దు. నేను విచక్షణతోనే ఈ పోస్ట్ పెట్టా. దీనివల్ల నాకు ఎలాంటి పేటియం డబ్బులు అందలేదు' అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ 2012లో విడిపోయారు. ఆ తర్వాత పవన్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. పవన్ కి రేణు దేశాయ్ తో ఒక కొడుకు, ఒక కుమార్తె.. అదే విధంగా అన్నా లెజినోవాతో ఒక కొడుకు, ఒక కుమార్తె సంతానం.