Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు

Published : May 23, 2026, 08:01 PM IST

Renu Desai: రేణు దేశాయ్‌.. తన కొడుకు అకీరా నందన్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అకీరా రోడ్డుపై పడి గాయాలపాలయినట్టు తెలిపింది. అయితే అది 12ఏళ్ల వయసులో అని, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. 

PREV
15
వివాదంపై రేణు దేశాయ్‌ వివరణ

నటి రేణు దేశాయ్‌.. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తోంది. తాజాగా ఓ ప్రైవేట్‌ ఇనిస్టిట్యూట్‌లో పాల్గొన్న ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కుక్కల రక్షణ కోసం ఆమె ఆ మధ్య ప్రెస్‌ క్లబ్‌లో హాట్‌ కామెంట్స్ చేసింది. తనని తప్పుపట్టిన జర్నలిస్ట్ లపై ఆమె ఫైర్‌ అయ్యింది. తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మీకు వాటిలా బాధ కలిగితే తెలుస్తుందని మండి పడింది. తాజాగా దీనికి వివరణ ఇచ్చింది. కుక్కల వల్లే జనాలకు ఇబ్బంది కలుగుతుందనేది వాస్తవం కాదని చెప్పింది.

25
బయట వేరే కారణాలతో చనిపోతున్నవారు చాలా మంది ఉన్నారు

బయట చాలా మంది ఇతర కారణాలతో చనిపోతున్నారని, చాలా మంది రోడ్ల యాక్సిడెంట్‌ వల్ల చనిపోతున్నారని, సరైన రోడ్లు లేక గుంతల్లో పడి చనిపోతున్నారని చెప్పింది. అంతేకాదు కనీసం తిండి లేక రోడ్లపై తిరుగుతూ చాలా మంది అడుక్కుంటున్నారని, కనీసం ఫుడ్‌ లేకుండా చనిపోతున్నారని, సరైన వైద్యం లేక చనిపోతున్నారని, ఇలా చాలా కారణాలతో చాలా మంది చనిపోతున్నారని, వాటితో పోల్చితే కుక్కల వల్ల జరిగే నష్టం చాలా తక్కువ అని, ఆ రోజు ఎందుకు ఫైర్‌ అయ్యానో పూర్తి వీడియో చూస్తే తెలుస్తుందని తెలిపింది రేణు దేశాయ్‌.

35
అకీరా నందన్‌కి గాయాలు

ఈ సందర్భంగా అకీరా నందన్‌కి జరిగిన సంఘటన పంచుకుంది. 12ఏళ్ల వయసులో  కింద పడి గాయాలయ్యాట. ఉదయాన్నే సైకిల్‌పై ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాడట అకీరా నందన్‌. రోడ్డుపై గుంతలు ఉన్నాయట. ఆ గుంతల కారణంగా సైకిల్‌ స్కిడ్‌ అయి కింద పడిపోయాడట. దీంతో ఆయన నుదుటిపై గాయమైందట. అలాగే చిన్‌ వద్ద బలంగా గాయమైందని తెలిపింది రేణు దేశాయ్‌. ఆ గాయం ఇప్పటికీ అలానే ఉందని, దీంతోపాటు అరచేతి కోసుకుపోయిందట. రక్తం కారుతూ ఇంటికి వచ్చాడని వెల్లడించింది. దానికి కారణం మన చెత్త ప్రభుత్వం వల్ల అని తెలిపింది. ప్రభుత్వం వైఫల్యం వల్ల రోడ్డు డ్యామేజ్‌ జరిగి అకీరా నందన్‌కి గాయమైందని వెల్లడించింది.

45
పోస్ట్ లు నేను చదవను

సోషల్‌ మీడియాపై రేణు దేశాయ్‌ స్పందిస్తూ, తాను సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండనని, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఉంటానని తెలిపింది. అయితే తనపై వచ్చే కామెంట్లని కూడా చదవను, చూడను. కానీ తనకు కొందరు ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు తనపై వచ్చిన కామెంట్లని చూసి, స్క్రీన్‌ షాట్లు పంపిస్తారు. దీంతో అవి చదివినిప్పుడు తాను రియాక్ట్ కావాల్సి వస్తుందని చెప్పింది రేణు దేశాయ్‌.

55
నటిగా కమ్‌ బ్యాక్‌

పవన్‌ కళ్యాణ్‌ భార్యగా, హీరోయిన్‌గా పాపులర్‌ అయిన రేణు దేశాయ్‌.. పవన్‌తో విడిపోయిన విషయం తెలిసింది. చాలా కాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. త్వరలో అవి విడుదల కాబోతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories