Ranbir Kapoor Home: పాత ఇంటిని అద్దెకి ఇచ్చిన అలియా భట్, రణ్‌బీర్.. నెలకు రూ.11 లక్షలు రెంట్

Published : May 23, 2026, 06:25 PM IST

ముంబై సెలబ్రిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి రణ్‌బీర్ కపూర్ పాలి హిల్‌లోని పాత అపార్ట్‌మెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నటుడు తన లగ్జరీ ఫ్లాట్‌ను భారీ మొత్తానికి అద్దెకు ఇచ్చినట్లు సమాచారం.

PREV
13
రణ్‌బీర్ కపూర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌
ముంబైలో ఇళ్ల ధరలు వింటేనే మన జేబులు ఖాళీ అయిపోతాయ్. అలాంటిది ఇక సెలబ్రిటీల ఇళ్ల గురించి అయితే చెప్పక్కర్లేదు. రణ్‌బీర్ కపూర్ బాంద్రాలోని పాలి హిల్ ఏరియాలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నెలకు ఏకంగా ₹11 లక్షల రూపాయలకు అద్దెకు ఇచ్చాడట. బాంద్రా వెస్ట్‌లోని వాస్తు బిల్డింగ్‌లో ఉన్న ఈ ఫ్లాట్‌ను ఆదిత్య శుక్లా అనే వ్యక్తికి ఐదేళ్ల లీజు అగ్రిమెంట్‌పై ఇచ్చారు. ఈ డీల్‌లో భాగంగా ప్రతి ఏటా ఐదు శాతం అద్దె పెంచే క్లాజ్‌తో పాటు, ఏకంగా ₹45 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్‌ను రణ్‌బీర్ 2016లో సుమారు ₹35 కోట్లకు కొనుగోలు చేశాడు. అప్పట్లో ఈ ఇల్లు ముంబైలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
23
సెలబ్రిటీ డిజైనర్ గౌరీ ఖాన్
ఈ అపార్ట్‌మెంట్ కేవలం ఒక లగ్జరీ ఇల్లు మాత్రమే కాదు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ అభిమానులకు ఈ ఇంటితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే, ఏప్రిల్ 14న ఈ జంట పెళ్లి చేసుకుంది ఇక్కడే. కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ముఖ్యంగా వీరి బాల్కనీ వెడ్డింగ్ బాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అంతేకాదు, ఈ ఇంటి ఇంటీరియర్స్‌ను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. అద్భుతమైన డిజైన్, ప్రైమ్ లొకేషన్.. ఇలా అన్ని హంగులు ఉండటంతో ఈ అడ్రస్ ఒక క్లాసిక్ బాలీవుడ్ డ్రీమ్ అడ్రస్‌గా మారింది.
33
నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణ పార్ట్ 1

దాదాపు ఏడాది క్రితం, రణ్‌బీర్, ఆలియా ఈ వాస్తు అపార్ట్‌మెంట్ నుంచి పాలి హిల్‌లోని వారి కొత్త ఫ్యామిలీ రెసిడెన్స్ 'కృష్ణ రాజ్ బంగ్లా'కు మారారు. ప్రస్తుతం ఈ జంట తమ కూతురు రహాతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఆరు అంతస్తుల ఈ బంగ్లా విలువ సుమారు ₹250 కోట్లు ఉంటుందని అంచనా. దీనికి రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ సహ యజమానిగా ఉన్నారు. రిషి కపూర్ తల్లి పేరు మీద ఈ బంగ్లాకు పేరు పెట్టడంతో కపూర్ ఫ్యామిలీకి ఇది ఎంతో ప్రత్యేకమైనది. రణ్‌బీర్ తన కొత్త ఇంటికి మారినప్పటికీ, అతని పాత అపార్ట్‌మెంట్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక సినిమాల విషయానికొస్తే, రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో 'రామాయణ: పార్ట్ 1 – ది ఇంట్రడక్షన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ & వార్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్' సీక్వెల్‌లో కూడా నటించనున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories