Renu Desai
రేణు దేశాయ్ నటిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ప్రేమ, సహజీవనం, పెళ్లి, విడాకులు ఈ విషయాల గురించి అందరికీ తెలిసిందే. పవన్ తో పెళ్లి తర్వాత రేణు దేశాయ్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. పవన్ నుంచి విడిపోయాక ఆమె పిల్లలతో కలసి పూణే లో జీవించారు. పిల్లల భాద్యత రేణుదేశాయ్ తీసుకున్నారు. ప్రస్తుతం అకిరా, ఆధ్య.. పవన్, రేణు దేశాయ్ ఇద్దరి దగ్గర ఉంటున్నారు.
Renu Desai
రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వర రావు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం సక్సెస్ కాలేదు. మరోవైపు రేణు దేశాయ్ కి రచనల పట్ల కూడా ఆసక్తి ఉంది. దర్శకత్వం కూడా చేశారు. రేణు దేశాయ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ టైంలో ఆమెని చూసిన పూరి జగన్నాధ్ బద్రి చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడింది.
Renu Desai
మోడలింగ్ లో ఉన్నప్పుడు రేణు దేశాయ్ ఎంతో ఇష్టంగా యాడ్ షూట్స్ లో పాల్గొనేవారట. హీరోయిన్ అయ్యాక యాడ్స్ లో నటించడం మానేశారు. 22 ఏళ్ళ తర్వాత తొలిసారి తిరిగి రేణు దేశాయ్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకు యాడ్ షూట్స్ లో పాల్గొనడం చాలా ఇష్టం. కానీ నా తలరాత వేరేలా రాసి ఉంది. అందుకే ఇష్టం లేకపోయినా హీరోయిన్ అయ్యాను. హీరోయిన్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. 22 ఏళ్ళ తర్వాత నాకు ఇష్టమైన పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు.
రేణు దేశాయ్ ఇటీవల వారణాసి లాంటి పుణ్యక్షేత్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. తన పిల్లలతో కలసి రేణు దేశాయ్ వారణాసికి వెళ్లారు. తిరిగి వచ్చి విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరేళ్ళ తర్వాత ఆమె విజయవాడకి రావడం ఇదే తొలిసారి.
విజయవాడలో ఆమె సావిత్రి భాయ్ పూలె జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు, టీచర్లని ఉద్దేశించి ఆమె అద్భుతంగా ప్రసంగించారు.