అకీరా నందన్‌ బర్త్ డే రోజు పవన్‌ ఫ్యాన్స్ కి రేణు దేశాయ్‌ వార్నింగ్‌.. నాకు కొడుకు కాదా అంటూ వ్యాఖ్యలు

Published : Apr 09, 2023, 10:29 AM ISTUpdated : Apr 09, 2023, 11:15 AM IST

పవన్‌ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్‌ ఫైర్‌ అయ్యింది. అకీరా నందన్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చేసిన కామెంట్లకి స్పందించిన ఆమె వారికి ఊహించని ఝలక్‌ ఇచ్చింది. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది.   

PREV
16
అకీరా నందన్‌ బర్త్ డే రోజు పవన్‌ ఫ్యాన్స్ కి రేణు దేశాయ్‌ వార్నింగ్‌.. నాకు కొడుకు కాదా అంటూ వ్యాఖ్యలు

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల ప్రేమకి ప్రతిరూపం కుమారుడు అకీరానందన్‌. ఇప్పుడు పెద్ద వాడయ్యాడు. శనివారం తన 19వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, వెల్‌ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలిపారు. అయితే ఓ వైపు బన్నీ, మరోవైపు అఖిల్‌ వంటి వారి పుట్టిన రోజు కావడంతో అకీరా నందన్‌ బర్త్ డే హైలైట్‌ కాలేదు. 

26

పవన్‌ ఫ్యాన్స్ మాత్రం తమ దేవుడు(పవన్‌) వారసుడు అకీరానే అంటూ ప్రకటించుకున్నారు. ఆయన లెగసీని కొనసాగించేది అకీరానే అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశారు. అకీరా మల్టీ టాలెంటెడ్‌ అంటూ ఆయన వీడియో క్లిప్పులు, ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. కర్రసాము చేయడం, కరాటే, బాక్సింగ్‌, స్టడీస్‌లో, మ్యూజిక్‌ రంగంలోనూ నైపుణ్యం ఉండటంతో మల్టీటాలెంటెడ్‌గా అభినందిస్తున్నారు. లిటిల్‌ పవర్‌ స్టార్ అంటూ ట్యాగ్‌ కూడా తగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో అకీరా హంగామా కూడా జరిగింది. 

36

ఇదిలా ఉంటే కొందరు పవన్‌ ఫ్యాన్స్ చేసిన కామెంట్లు రేణు దేశాయ్‌కి కోపం తెప్పించాయి. ఆమె హర్ట్ అయ్యేలా చేశాయి. దీంతో ఆమె ఘాటుగా స్పందించింది. సదరు పవన్‌ అభిమానులకు షాకిచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే .. కొందరు పవన్‌ అభిమానులు అకీరాకి బర్త్ డే విషెస్‌ చెబుతూ, అకీరాని తమకి చూపించడం లేదని, ఇది అన్యాయమంటూ పోస్ట్ పెట్టారు. `మేడం ఇది చాలా అన్యాయం. మా అకీరాని ఒక్కసారైనా చూపించండి, మా అన్న(పవన్‌) కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు కనిపించకుండా చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్‌లో అకీరా బాబుని చూపించండి` అంటూ  ఓ నెటిజన్ రేణుదేశాయ్‌కి పోస్ట్ పెట్టాడు. 
 

46

దీనికి రేణు దేశాయ్‌ స్పందించింది. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. మీ అన్న కొడుకా? అంటూ ఫైర్‌ అయ్యింది. `అకీరా నా కొడుకు. మీరు ఒకతల్లికి పుట్టిలేదా, మీరు హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. అకీరా బర్త్ డే ఒక్క రోజు. నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన నాకు నెగటివ్‌ కామెంట్స్ పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 11ఏళ్ల నుంచి నేను అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఒక తల్లిగా నేను చాలా హర్ట్ అవుతాను. ఇందులో తప్పేంటో నాకు అర్థం కావడం లేదు` అని పేర్కొంది. 

56
Renu Desai

అంతేకాదు నన్ను ఓ విలన్‌గా, బ్యాడ్‌ పర్సన్‌గా చిత్రీకరిస్తున్నారు. దీనిపై నేను రియాక్ట్ అయ్యి అలసిపోయాను. ఇది నా మానసిక స్థితిపై ప్రభావం పడుతుందంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు వాళ్లు ఏదన్నా భరించానని, ఇక తన వల్ల కాదని, హద్దులు దాటొద్దని పరోక్షంగా పవన్‌ ఫ్యాన్స్ కి రేణు దేశాయ్‌ వార్నింగ్‌ ఇచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంత అభిమానం ఉన్నా, అవతలి వ్యక్తుల పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని, ఇష్టారీతిన మాట్లాడకూడదని రేణు దేశాయ్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, హాట్‌ టాపిక్‌గా మారాయి. 
 

66
Pawan Kalyan

పవన్‌ కళ్యాణ్‌.. తన మొదటిభార్య నందినితో ఉన్నప్పుడే, `బద్రి` హీరోయిన్‌ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి సహజీవనం చేశాడు. ఈ క్రమంలోనే 2004లో వీరికి కుమారు అకీరానందన్‌ జన్మించారు. దాదాపు ఎనిమిదేళ్ల సహజీవనం అనంతరం 2008లో విడాకులిచ్చి, 2009లో రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఏడాదికి వీరికి కూతురు ఆద్య జన్మించింది. రెండేళ్ల తర్వాత రేణు దేశాయ్‌కి కూడా పవన్‌ విడాకులిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రష్యా అమ్మాయి అన్న లెజ్‌నోవ్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. రేణు దేశాయ్‌.. ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories