ఒక పక్క బేబీబంప్.. భర్తతో రొమాంటిక్ ఫోజులిచ్చిన పూజా రామచంద్రన్

Published : Apr 09, 2023, 08:05 AM IST

ఈమధ్య సెలబ్రిటీలు ప్రతీ ఒక్క మధుర క్షణాలను ఫోటోలు, వీడియోల రూపంలో బంధించుకోవాలనిచూస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదివరకు కూడా ఇలాంటిపరిస్థితి ఉన్నా..? ఈమధ్య అది ఎక్కువైపోయింది. 

PREV
16
ఒక పక్క బేబీబంప్.. భర్తతో రొమాంటిక్ ఫోజులిచ్చిన పూజా రామచంద్రన్

రీసెంట్ గా తన బేబీబంప్ ఫోటోషూట్ ను.. సోషల్ మీడియాలో పంచుకుంది వెండితెర నటి పూజా రామచంద్రన్. బిడ్డను కడుపులో మోస్తున్న క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా.. బద్రంగా దాచుకోవాలని ప్లాన్ చేసింది. 
 

26

అయితే ఈ బేబీ బంప్ ఫోటోలతో పాటు.. తన భర్తతో కిస్ చేస్తున్న రొమాంటిక్ ఫోటోస్ ను కూడా పూజా శేర్ చేసింది. బేబీబంప్ తో ఉండి.. బర్తను కిస్ చేస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. 

36

లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా, అడవి కాచిన వెన్నెల వంటి సినిమాల్లో నటించిన బ్యూటీ  పూజా రామచంద్రన్..   కర్లీ హెయిర్ తో .. ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ...యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది బ్యూటీ. ప్రస్తుతం పూజా గర్భవతిగా మధుర క్షణాలను ఆస్వాదిస్తోంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ బాగా సుపరిచితురాలు అయ్యింది. 
 

46

బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్ లో అడుగుపెట్టిన పూజా రామచంద్రన్.. మధ్యలో వచ్చినా.. కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఫిజికల్ టాస్కుల్లో దూసుకుపోయి..  సత్తా చాటింది  పూజా. కాని హౌస్ లో ఎక్కవరోజులు ఉండలేకపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడంవల్లనో ఏమో.. పెద్దగా ఓట్లు పడక..ఫైనల్స్ వరకూ వెళ్ళకుండానే  ఆమె ఎలిమినేట్ అయిపోయింది. 
 

56

2010లో వీజే క్రెగ్ ను పెళ్ళి చేసుకున్న పూజా.. ఇద్దరికి మనస్పర్థలు రావడంతో..  2017లో విడాకులు ఇచ్చేసింది. ఇక  2019లో జాన్ కొక్కెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటోంది. ప్రస్తుతం వీరు తల్లీ తండ్రులు కాబోతున్నారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్  పేజ్ లో వెల్లడిస్తుంది పూజా..  గర్భవతిగా ఉంటూనే ఆమె యోగా, వ్యాయామాలు చేస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. 
 

66

బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత పూజాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. వెంట వెంటనే.. వెంకీ మామ, ఎంత మంచివాడవురా, పవర్ ప్లే లాంటి సినిమాల్లో నటించింది. నటినా తనను నతాను నిరూపించుకుంది బ్యూటీ. తెలుగుతో పాటే.. తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. కానీ పూజాకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటుంది.

click me!

Recommended Stories