
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తోంది. పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కు పవర్ ప్యాక్ మీల్స్ దొరికినట్టు అయ్యింది. అయితే ఈసినిమా రివ్యూస్ కూడా పాజిటీవ్ వస్తున్నాయి. పవన్ ను ఈ సినిమాలో డిఫరెంట్ గా చూపించారని తెలుస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే ఈసినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మరో ఎత్తు. అఖండ తరువాత కాస్త డల్ అయినట్టు కనిపించాడు తమన్. కాని ఓజీ సినిమాతో థియేటర్ లోని స్పీకర్స్ ను బ్లాస్ట్ చేసేస్తున్నాడు. పాటల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కు తమన్ కొట్టిన డ్రమ్స్ ఫ్యాన్స్ కు గూజ్ బాంమ్స్ తెప్పించాయి. యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు పవన్ కళ్యాణ్ ఏలివేషన్ సీన్స్ కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఫ్యాన్స్ ను కుర్చీల్లో కూర్చోనివ్వలేదు. ఓజీకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బీజియం వల్ల సినిమాలో మైనస్ లను ఆడియన్స్ పెద్దగా పట్టిచుకోలేదనిచెప్పాలి.
నిజాకి ఓజీ కథ కాస్త వీక్ గా ఉంది. అంతే కాదు స్క్రీన్ ప్లే లో కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండటం, పాలిటిక్స్ తో బిజీ బిజీ అవ్వడంతో సినిమాలకు సరిగ్గా టైమ్ ఇవ్వలేకపోయాడు. దాంతో సినిమాలో కొన్ని సన్నివేశాలు కట్ అండ్ పేస్ట్ లా తయారయ్యాయి. కాని ఈ స్క్రీన్ ప్లేన్ కూడా కవర్ చేయగలిగేలా తమన్ మ్యూజిక్ ఉంది. అంతే కాదు ఎన్నడు లేని విధంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ తో సినిమా అంతా నింపేశారు. కథలో ఇతన ఎలిమెంట్స్ ను తగ్గించేశారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెంటిమెంట్ పక్కాగా కనిపిస్తుంది. కాని ఓజీ సినిమాలో సెంటెమెంట్ సీన్స్ అస్సలు పండలేదే, అసలు కథ ఏమాత్రం ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. కానీ పవన్ ఎలివేషన్ సీన్స్ కు మాత్రం భారీ ఎత్తున రెస్పాస్ వచ్చింది. ఎలివేషన్ సీన్స్ కు బ్యాక్ గ్రరౌండ్ మ్యూజిక్ విషయంలో మరోసారి అఖండను గుర్తు చేశాడు తమన్. ఆ దెబ్బతో తమన్ మరోసారి బిజీ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.
అసలు బీజీయంతో అల్లాడించడం అంటే ఈమధ్య కాలంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పేరు బాగా వినిపించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ స్టైల్ కు , అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా హైలెట్ అవ్వలేదు. ఈ సినిమా తో మోత మోగించేశాడు, దాంతో అనిరుధ్ కు అవకాశాలు భారీగా పెరగడంతో పాటు, రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచాడు. ఇక అప్పటి నుంచి అనిరుధ్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఎన్ని సినమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించగలడు. జైలర్ తరువాత అనిరుధ్ చేసిన సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మళ్లీ జైలర్ 2 తో రఫ్పాడించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక తెలుగు సినిమాలకు అనిరుధ్ టైమ్ ఇవ్వడంలేదు. ఇచ్చినా సరే ఏదో చేయలేదు అన్నట్టుగానే మ్యూజిక్ చేసి వదిలేస్తున్నాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాలకు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈక్రమంలో ఓజీ సినిమాతో తమన్ రెచ్చిపోయాడు. అటు పవన్ ఊచకూత కోస్తుంటే.. ఇటు తమన్ దానికి తగ్గట్టుగా వాయించేశాడు.. దాంతో ఫ్యాన్స్ కు ఫుల్ పండగ అయిపోయింది. ఇక టాలీవుడ్ లో అనిరుధ్ కోసం వెయిటింగ్ అవసరం లేదు..తమన్ కు ఇచ్చేద్దాం అనుకుంటున్నారట మూవీ మేకర్స్.
తమన్ ఈ రేంజ్ లో వాయించడం ఇప్పుడు కొత్తేం కాదు.. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాకు అదరిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలకు స్పీకర్లు పగిలిపోయేలా తమన్ డ్రమ్స్ వాయించాడు.. ఆతరువాత కాస్త తమన్ ప్రభావం తగ్గినట్టు అనిపించింది. అయితే అఖండ 2 ఉంది కదా.. ఆ సినిమాతో మళ్లీ దడదడలాడించేస్తాడు అనుకున్నారు ప్యాన్స్. కాని ఈలోపు ఓజీ సినిమాతో వణికించేశాడు తమన్. తమన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరువాత మాస్ సినిమాలకు కింగ్ ఆఫ్ మ్యూజిక్ గా మారిపోయాడు.
గతంలో ఓ దశాబ్ధానికి పైగా దేవిశ్రీ ప్రసాద్ తెలుగు సినిమా మ్యూజిక్ ను శాసించాడు. యంగ్ స్టార్స్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్టు పరిస్థితి మారిపోయింది. అటు తమిళంలో కూడా స్టార్ హీరోలకు దేవిశ్రీ ఓన్లీ ఆప్షన్ గా మారిపోయాడు. కాని తమన్ వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేవిశ్రీకి రావల్సిన అవకాశాలన్నీ తమన్ ఖాతాలో పడిపోతూ వచ్చాయి. టాలీవుడ్ లో దేవిశ్రీ ప్రభావాన్ని చాలావరకూ తగ్గించేశాడు తమన్. అయితే అటు దేవిశ్రీ ప్రసాద్ కూడా తాను ఏం తక్కువ కాదు అన్నట్టు, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవతూనే ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప, పుష్ప2 దో రికార్డులు బ్రేక్ చేశాడు దేవిశ్రీ.
దేవిశ్రీ ప్రభావాన్ని ఎంతో కొంత తమన్ తగ్గిచాడు, ఇక ఆతరువాత వచ్చిన అనిరుధ్ ప్రభావం కూడా టాలీవుడ్ లో లేకుండా చేస్తున్నాడు తమన్. తన మ్యూజిక్ తో మాస్ జనాలకు అదరిపోయే ట్రీట్ ఇస్తున్నాడు. దాంతో అనిరుధ్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్లంతా తమన్ వైపు టర్న్ అవుతున్నారు. ఇక ఓజీతో దుమ్మురేపేసిన తమన్.. అఖండ2 తరువాత మరింత రెచ్చిపోతాడనడంలో ఏమాత్రం సందేహంలేదు. కాస్త యావరేజ్ గా నడవాల్సిన ఓజీ కథకు పవన్ కళ్యాణ్ స్టైల్, లుక్స్, యాక్షన్ సీన్స్ తో పాటు తమన్ మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పవచ్చు. మరి ముందు ముందు తమన్ తన మ్యూజిక్ తో ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.