పెళ్లై, పిల్లలున్నా కొందరు సెలబ్రిటీలు మళ్లీ ప్రేమలో పడ్డారు. రూమరో, నిజమో తెలియదు కానీ.. ఇలాంటి వివాదాల వల్ల తమ కాపురాలు పాడు చేసుకున్న స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. వివాహ బంధం నుంచి విడాకుల వరకు వెళ్లిన ఆ స్టార్స్ ఎవరో తెలుసా?
నటుడు విజయ్ దళపతికి మరో నటితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విజయ్, నటి త్రిషతో కలిసి ఒకే కారులో పెళ్లికి హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇలా ఇంకొంత మంది తారలు కూడా ఇలాంటి వివాదాల వల్ల ఇబ్బందులు పడ్డారు.
25
జయం రవి
నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి.. గాయని కెనిషాతో సంబంధంలో ఉన్నారని ఆయన భార్య ఆరతి మోహన్ ఆరోపించారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. తాము సంబంధంలో ఉన్నది నిజమేనని వారిద్దరూ ఒప్పుకున్నట్లు సమాచారం.
35
ధనుష్
నటుడు ధనుష్ పేరు చుట్టూ చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత, కాజల్, త్రిష, శ్రుతి హాసన్ వంటి వారితో ఆయన ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఐశ్వర్య రజినీకాంత్‌తో ధనుష్ పెళ్లి నిలవలేదు, ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ధనుష్ అక్రమ సంబంధాల వల్లే విడిపోయారని అంటారు.
ప్రభుదేవా, నయనతార ప్రేమకథ అందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ప్రభుదేవా, నయనతారతో ప్రేమలో పడ్డారు. ఈ కారణంగానే ప్రభుదేవా, ఆయన భార్య విడిపోయారు. క్రిస్టియన్ అయిన నయనతార, ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటే ఊరుకోమని కొన్ని సంస్థలు హెచ్చరించడం,, ప్రభుదేవ మొదటి భార్య గొడవ చేయడంతో.. నయన్ ప్రభుదేవాకు దూరమయ్యారని చెబుతారు. ఇక ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.
55
ఓం పురి
ఓం పురి మొదటి భార్య సీమా కపూర్ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆయన నందిత అనే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారు. ఎంతకీ ఆయన మారకపోవడంతో సీమా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో ఓం పురి, నందితను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. 2017లో ఓం పురి మరణించారు.