బాహుబలి రికార్డ్స్ బద్దలే లక్ష్యంగా ప్రభాస్ మాస్టర్ ప్లాన్ ... ఆదిపురుష్ సినిమా కోసం దిమ్మతిరిగే స్ట్రాటజీ..!

First Published Sep 16, 2022, 10:56 AM IST


ఆదిపురుష్ తో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. దీని కోసం ఆయన భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. గత పరాజయాలు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సిద్ధం అవుతున్నారు. 

Prabhas

బాహుబలితో గ్లోబల్ ఇమేజ్ రాబట్టిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసిన బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు నిరాశపరిచాయి. ఎవరూ ఊహించని హైప్ మధ్య విడుదలైన సాహో నిరాశపరిచింది. హిందీలో విజయం సాధించిన సాహో.. తెలుగుతో పాటు ఇతర భాషల్లో దారుణ పరాజయం చవిచూసింది. ఇక రాధే శ్యామ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం డిజాస్టర్ గా రాధే శ్యామ్ నిలిచింది.

Prabhas

రెండు వరుస పరాజయాల నేపథ్యంలో ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దానికి ఆదిపురుష్ సరైన మూవీగా భావిస్తున్నారు. ప్రమోషన్స్ నుండి డబ్బింగ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో పౌరాణిక గాథగా ఆదిపురుష్ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడు పాత్ర చేస్తున్నారు. కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ పౌరాణిక పాత్ర చేస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ తెరకెక్కుతుంది. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
 

ఆదిపురుష్ విజయాన్ని టీమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. హిందువుల ఆరాధ్య దైవం రాముని వీరగాథగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ ని వాడుకునే ఆలోచన చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో హిందూ సెంటిమెంట్ కోణం జోడిస్తున్నారు. సెప్టెంబర్ 26న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. రామునిగా ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో నెలకొని ఉంది.

ఇక ఆదిపురుష్ చిత్ర టీజర్ విడుదల మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ నెలలో ఆదిపురుష్ టీజర్ రామజన్మభూమి అయోధ్యలో విడుదల చేస్తారట. హిందూ వర్గాల్లో సినిమాపై ఆసక్తి పెంచేందుకు, సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునే ప్రణాళికలో భాగంగా అయోధ్యలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. హిందువుల్లో ఆ వైబ్ క్రియేట్ చేయడం ద్వారా భారీగా లబ్ధి పొందాలనేది యూనిట్ ఆలోచనగా తెలుస్తుంది.

adipurush


అది అలా ఉంచితే... సాహో, రాధే శ్యామ్ చిత్రాల పరాజయానికి కారణమైన అంశాల్లో ప్రభాస్ వాయిస్ కూడా ఒకటి. బాహుబలి చిత్రాల్లో మాత్రం ఆయనకు డబ్బింగ్ చెప్పారు. సాహో, రాధే శ్యామ్ చిత్రాలకు హిందీ వెర్షన్ కి కూడా ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. కొన్నాళ్లుగా ప్రభాస్ వాయిస్ మారిపోయింది. ఆయన చెబుతున్న తెలుగు డైలాగ్స్ అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంది. హిందీ డైలాగ్స్ మరింత దారుణంగా ఉంటున్నాయి. దీనికి పరిష్కారం హిందీ వెర్షన్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ ని తీసుకోవాలి అనుకుంటున్నారట. 

బాహుబలి చిత్రాలకు ప్రభాస్ కి వాయిస్ అరువు ఇచ్చిన శరద్ కేల్కర్ ని ఆదిపురుష్ కోసం తీసుకుంటున్నారట. శరద్ కేల్కర్ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పనున్నారట. శరద్ కేల్కర్ ది ఫ్యామిలీ మాన్ 2 లో ప్రియమణి రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రోల్ చేశారు. శరద్ కేల్కర్ వాయిస్ ప్రభాస్ రోల్ ని మరింత ఎలివేట్ చేయడంలో ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. 
 


బడ్జెట్ తో సింహభాగం విఎఫ్ఎక్స్ కి ఖర్చు చేస్తుండగా... మూవీ విజువల్ వండర్ అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ ప్రత్యర్థి రవాణాసురుడి పాత్ర చేస్తున్నారు. ఇక సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తుంది. పక్కా ప్రణాళికతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆదిపురుష్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.   
 

click me!