మొదటి వారమే వంటలక్క రికార్డుల మోత... టీఆర్పీలో దుమ్మురేపిన కార్తీక దీపం 2

First Published Apr 5, 2024, 9:15 AM IST


అనుకున్నట్లే కార్తీక దీపం 2 విశేష ఆదరణ దక్కించుకుంటుంది. మొదటివారమే రికార్డుల మోత మోగించింది. భారీ టీఆర్పీ రాబట్టింది. 
 

Karthika Deepam 2

కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై ఒక సంచలనం. దర్శకుడు కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించిన ఈ సీరియల్ నేషనల్ వైడ్ రికార్డ్స్ నెలగొల్పింది. 2017 అక్టోబర్ 17న కార్తీక దీపం సీరియల్ ప్రారంభం అయ్యింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

Karthika Deepam 2

దీప అలియాస్ వంటలక్క పాత్రను మలయాళీ నటి ప్రేమీ విశ్వనాథ్ చేశారు. కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్రను నిరుపమ్ పరిటాల చేశారు. ఇక ప్రధాన విలన్ మోనిత గా శోభ శెట్టి నటించి మెప్పించి. ఈ మూడు ప్రధాన పాత్రల ఆధారంగా తెరకెక్కిన కార్తీక దీపం 21 టీఆర్పీ సాధించి దేశంలోనే నెంబర్ వన్ సీరియల్ గా నడిచింది. 

Karthika Deepam 2

కార్తీక దీపం సీరియల్ కోసం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. 1569 ఎపిసోడ్స్ కార్తీక దీపం సీరియల్ నడిచింది. ఈ క్రమంలో కొన్ని ప్రయోగాలు చేశారు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను చంపేశారు. ఈ ప్రయోగం వికటించింది. మరలా వారిని రంగంలోకి దించారు. 

Karthika Deepam 2

ప్రతి కథకు ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుందని కార్తీక దీపం సీరియల్ కి 2023 జనవరిలో ముగింపు పలికారు. తాజాగా కార్తీక దీపం 2 ప్రారంభం అయ్యింది. నవ వసంతం పేరుతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. దీప బాల్యం నుండి ఈ సీరియల్ మొదలైంది. 

కార్తీక దీపంలో నటించిన ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల మరోసారి ప్రధాన పాత్రలు చేస్తున్నారు. కాగా కార్తీక దీపం 2 మొదటివారమే రికార్డు టీఆర్పీ రాబట్టింది. ఈ సీరియల్ 12.93 రేటింగ్ రాబట్టింది. కార్తీక దీపం 2 అర్బన్ లో 10.40, అర్బన్+రూరల్ కలిపి 12.93 రేటింగ్ సాధించింది. 

ఒక్క దెబ్బకు టాప్ రేటింగ్ సీరియల్స్ మొత్తం కిందకు పడిపోయాయి. వంటలక్క ఎంట్రీ ఇచ్చాక రికార్డుల మోతే అంటున్నారు. మొదటివారమే ఈ స్థాయిలో రేటింగ్ సాధించిన నేపథ్యంలో కథ రసకందాయంలో పడ్డాక రేటింగ్ రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు. 

click me!