స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఎన్టీఆర్, పెళ్ళికి రెడీ... హరికృష్ణ సీరియస్, అప్పుడు ఏం చేశాడంటే?

First Published | Apr 5, 2024, 7:13 AM IST

అనతికాలంలో స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఒక హీరోయిన్ ని ఘాడంగా ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయంలో తండ్రి హరికృష్ణ సీరియస్ అయ్యాడు. అప్పుడే అసలు కథ మొదలైంది.. 
 

NTR

నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ ఎంట్రీ ఒక సంచలనం. టీనేజ్ కూడా పూర్తి కాకుండానే హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. 2001లో విడుదలైన నిన్ను చూడాలని ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ. అదే ఏడాది విడుదలైన స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో హిట్ కొట్టాడు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

NTR

ఆది, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్స్ తో మాస్ హీరో అయ్యాడు. స్టార్డం సొంతం చేసుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ని ఘాడంగా ప్రేమించాడు. బి. గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రంలో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. మలయాళీ కుట్టి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. 
 


NTR

సమీరా రెడ్డికి నరసింహడు తెలుగులో మొదటి చిత్రం. రెండో చిత్రంగా జై చిరంజీవా చేసింది. ఎన్టీఆర్ తో అశోక్ చిత్రంలో రెండోసారి జతకట్టింది. ఈ క్రమంలో ఎన్టీఆర్-సమీరా రెడ్డి మధ్య ప్రేమ చిగురించింది. ఎన్టీఆర్ ఆమెనే పెళ్లి చేసుకోవాలని స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యాడట. ఈ విషయం ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ వద్దకు చేరిందట.

NTR

ఎన్టీఆర్ పై హరికృష్ణ సీరియస్ అయ్యాడట. కెరీర్లో ఎదిగే సమయంలో ప్రేమ, పిళ్లి కరెక్ట్ కాదని అన్నాడట. అలాగే ఓ బాలీవుడ్ హీరోయిన్ ని కోడలిగా తెచ్చుకోవడానికి ఇష్టపడలేదట. అదే సమయంలో ఎన్టీఆర్ కి త్వరలో పెళ్లి చేయాలని భావించాడట. 
 

NTR

హరికృష్ణ మాటను గౌరవించి సమీరా రెడ్డితో తన బంధానికి ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టాడట. అప్పట్లో ఎన్టీఆర్-సమీరా రెడ్డి మధ్య ఎఫైర్ నడుస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఓ సందర్భంలో సమీరా రెడ్డి సైతం ఎన్టీఆర్ తో  ఎఫైర్ రూమర్స్ నన్ను ఇబ్బందిపెట్టాయి. అందుకే టాలీవుడ్ కి దూరం అయ్యాను అన్నారు. అతను నాకు మంచి మిత్రుడు మాత్రమే అన్నారు.

NTR


అశోక్ తర్వాత ఆమె తెలుగులో చిత్రాలు చేయలేదు. చాలా గ్యాప్ ఇచ్చి కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. 2011లో ఎన్టీఆర్ బంధువుల అమ్మాయి అయిన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. నిజంగా సమీరా రెడ్డి-ఎన్టీఆర్ మధ్య ఎఫైర్ నడిచిందా లేదా? అనేది ఎవరికీ తెలియదు. కథనాలు మాత్రం వెలువడ్డాయి.  

Latest Videos

click me!