'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో అదిరిపోయే బిజినెస్ చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ఆయిన సితార ఎంటెర్టైనమెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ రేట్ కు కొనుగోలు చేసాడు. అలాగే రీసెంట్ గా దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ కూడా డీల్ క్లోజ్ చేశారు దేవర నిర్మాతలు. కన్నడ థియేట్రికల్ రైట్స్ ను రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ KVN ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేసాడు. ఊహించని విధంగా దేవర బిజినెస్ లోకి రాజమౌళి కొడుకు రావటంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో కార్తికేయ ఎంట్రికి కారణాలు ఏంటనే విషయం సోషల్ మీడియాలో చర్చ కు తెర లేపింది.
Devara
గత కొద్ది నెలులుగా ట్రేడ్ లో హాట్ మేటర్ మూడు సినిమాలే. అవి ప్రభాస్ కల్కి,అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర. ప్రభాస్ కల్కి ఆల్రెడీ మన ముందుకు వచ్చేసి రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. పుష్ప విషయానికి వస్తే ఆగస్ట్ 15కు వస్తుందనుకుంటే రకరకాల కారణాలతో వాయిదా పడింది. దాంతో జనం దృష్టి పూర్తిగా దేవర పైకి మళ్ళింది. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కావటం, ఇప్పటికే బయిటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ క్లిక్ అవటంతో బిజినెస్ వర్గాల్లో ‘దేవర’హాట్ కేక్ లా మారింది. దాంతో ఫ్యాన్సీ ఆఫర్స్ తో దేవర ముందు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.
దేవర బిజినెస్ డీల్ లో పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. ఈ మేరకు దేవర థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో ఎవరి సర్కిల్స్ లో వారు ట్రైల్ మొదలెట్టారు. రాజమౌళి కుమారుడుకు, ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం దృష్టిలో పెట్టుకుని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ కార్తికేయను ఎప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇప్పిస్తే కలిసి బిజినెస్ చేసుకుందామనే ప్రపోజల్ కు ఒప్పుకున్న కార్తికేయ ఈ డీల్ ని డీల్ చేసాడంటున్నారు. అలా కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ KVN ప్రొడక్షన్స్ తో కలిసి కార్తికేయ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న విషయం. నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
ప్రేమలు సినిమాతో కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. దేవర కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు.. కారికేయ తెలిపారు. “అతని ఫోర్ట్. అతని ఎదుగుదల. అతని విజయం… అంతా నా తారక్ అన్న ప్రేమ కోసం. దేవర కెవిఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి దేవర చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.” అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ ప్రకటించారు.
మరో ప్రక్క దేవర చిత్రం తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారు. ఆయన తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం బయిటకు రాగానే వంశీకు భారీ గా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకుని వంశీ ...డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాంతో తన జేబులోంచి పడకుండానే వంశీకు మంచి లాభాలు రాబోతున్నట్లు చెప్తున్నారు. దసరా సీజన్ లో టెర్రిఫిక్ బజ్ తో ఈ సినిమా రిలీజ్ కానుండటమే అందుకు కారణం.
Devara update
ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌ను రంగంలోకి దింపింది. "ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
కరణ్ జోహార్‌తో పాటు AA ఫిలిమ్స్ సంయుక్తంగా నార్త్‌లో దేవర సినిమాను రిలీజ్ చేయబోతుంది. కరణ్ జోహార్ లాంటి నిర్మాత బాలీవుడ్‌లో దేవరను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమాను నార్త్‌లో వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం 'దేవర' . ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు.
రిలీజ్ డేట్ ని ముందుకు తీసుకొచ్చి సెప్టెంబర్ 27 కి ఫిక్స్ చేయటం కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. దసరా ముందు సినిమాకు ఉన్న క్రేజ్ తో కలెక్షన్స్ వస్తాయి. దసరా శెలవుల్లో ఎలాగూ ప్లస్ అవుతాయి. వాస్తవానికి దసరా కానుకగా అక్టోబర్ 10న మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ 'దేవర' చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి.. దసరా సందర్భంగా పలు భాషల నుంచి భారీ పోటీ ఏర్పడనుంది.
ఈ సినిమా ప్లస్ ల విషయానికి వస్తే... ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనక బడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ రావటం మరో ప్లస్ పాయింట్.
మరో ప్రక్క ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశానికి అంతా సిద్దమైంది. 'వార్ 2'తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్దం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్దలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తోంది. అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది. దాంతో ఎన్టీఆర్ దేవర కొనటానికి అక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదేమీ ఇప్పుటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు.