దిల్ రాజు ఏం చేసినా చాలా ఆలోచించి అడుగులు వేస్తారు. ఆయనకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో అనుభవం ఉంది. ఆ ఎక్సపీరియన్స్ ఆయన నిర్ణయాలలో కనపడుతుంది. సినిమాలు హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ప్రక్కన పెడితే బిజినెస్ విషయంలో ఆయన్ను కొట్టిన వాళ్లు లేరు. అలాగే హీరోలను లాంచ్ చేయటంలో, వాళ్లను నిలబెట్టే సినిమాలు ప్లాన్ చేయటంలో ఆయనకి ఆయనే సాటి అంటారు. సినిమాలు రిలీజ్ టైమ్ లో వేరే సినిమాలు మార్కెట్లో ఏమున్నాయో చూడటం, థియటర్స్ లో ఏ సినిమాకు ఎక్కువ ఎక్కడ రెస్పాన్స్ వస్తుందో చూసుకుని ముందుకు వెళ్లటం దిల్ రాజుకు వెన్నతో పెట్టిన విద్య.