షాకింగ్ ఇన్ఫో: 30 కోట్లు ఒక్కసారిగా పెంచేసిన రామ్ చరణ్, ఎంత రెమ్యునరేషన్ అంటే..

First Published Apr 23, 2024, 2:05 PM IST

ఆర్ఆర్ఆర్ . నుంచి చరణ్ గురించి ఏదో ఒక వార్త  మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.తాజాగా మరో వార్త    మీడియాని ఒక ఊపు ఊపుతోంది. అదేమిటంటే.,...

  రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.   ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న  ఈ సినిమా జూన్ చివర నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా నిమిత్తం రామ్ చరణ్ తీసుకోబోయే రెమ్యునేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. గేమ్ ఛేంజర్ చిత్రం కన్నా 30 కోట్లు పెంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు గేమ్ ఛేంజర్ సినిమా కు ఎంత తీసుకుంటున్నారు...బుచ్చి బాబు సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ పే చేసేది ఎంతో చూద్దాం.

Chiraneevi

రాజమౌళితో చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నుంచి మెగా స్టార్డమ్ భారీగా మొదలైందని చెప్పాలి. ఈ సినిమా మొదలు ప్రపంచ వ్యాప్తంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరు మారుమోగుతోంది.  ఈ సినిమా తో గ్లోబల్‌ స్టార్‌గా బిరుదు పొందాడు. ఆ తర్వాత అనేక ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రామాలకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరై అంతర్జాతీయ వేదికలపై అవార్డులు ప్రదానం చేశాడు. రీసెంట్ గా  వేల్స్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ తీసుకుని అరుదైన గౌరవం అందుకున్నాడు. 

RC 16 Launching


ఇలా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ పోతున్నాడు ఈ గ్లోబల్‌ స్టార్‌. ఈ క్రమంలోనే రిటర్న్స్ కూడా పెరుగుతున్నాయి. రీసెంట్ గా  రామ్‌ చరణ్‌ తన రెమ్యునేషన్‌ పెంచారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు  తీసుకునే చరణ్‌..  ఈ  చిత్రానికి ఏకంగా రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

RC 16 Launching

ఆర్. ఆర్. ఆర్  చిత్రం తర్వాత చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' చేస్తున్నాడు. దీనితో పాటు #RC16 సినిమాను ముందుకు తీసుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యలర్‌ షూటింగ్ జరగనుంది. ఈ క్రమంలో చరణ్‌ రెమ్యునరేషన్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 'గేమ్‌ ఛేంజర్‌'  ఆర్‌సీ 16(#RC16)కి చరణ్‌ భారీగా రెమ్యునరేషన్ పెంచాడంటున్నారు. అయితే   మైత్రీ వారే ముందుకు వచ్చి  ఏకంగా 30 శాతం పెంచాడని అంటున్నారు. అంటే దాదాపు  రూ. 30 కోట్లు  పెంచినట్టు తెలుస్తోంది.
 

RC 16 Launching


అంటే ఆ లెక్క ప్రకారం బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాకు రూ. 125 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు  సినీ సర్కిల్లో  వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్‌ తర్వాత తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల్లో చరణ్‌ టాప్‌లో నిలిచాడు. అయితే ఈ విషయమై మీడియాలో వార్తలే తప్పించి అధికారిక సమాచారం లేదు.  

RC 16 Launching


ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు  చిత్రానికి మంచి క్రేజ్ ఉంది.  ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్‌ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్‌ సినిమాకు పెడుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.  


 అలాగే ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రటీమ్  ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని, ఎగ్రిమెంట్ అయ్యాకనే ఎనౌన్సమెంట్ వస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే సంజయ్ దత్..‘కేజీయఫ్‌ 2’, ‘లియో’లో సంజయ్‌ విలన్‌గా కనిపించారు. ఆయా చిత్రాలతో ఆయన తెలుగువారికీ చేరువయ్యారు. ప్రస్తుతం రామ్‌ నటిస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

  ఈ చిత్రం నిమిత్తం ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారు.  ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. అలాగే రామ్ చరణ్ ఉత్తరాంధ్రకు చెందిన స్పోర్ట్స్ పర్శన్ గా కనిపించనున్నారు. అక్కడ స్లాంగ్ నే మాట్లాడనున్నారు. రంగస్దలం చిత్రం అచ్చమైన  గోదావరి యాసలో మాట్లాడిన ఆయన ఈ సినిమాలోనూ ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోనున్నారు. అందుకోసం రామ్ చరణ్ హోమ్ వర్క్ చేయబోతున్నారు. డైలాగులు విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ నవలా రచయిత సాయిం చేస్తున్నట్లు వినికిడి. ఏప్రియల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
 

 రంగస్థలం లాగా రస్టిక్ నేచర్ తో ఆ చిత్రానికి పది రెట్లు గ్రాండ్ గా అబ్బురపరిచే సన్నివేశాలతో చాలా వైల్డ్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.   స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ కనిపించనున్నారు. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  అలాగే  ఈ  సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Ramcharan, rahaman


 
 రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.  ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట.   పూర్తి వివరాలను బుచ్చిబాబు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.   

ramcharan

చరణ్  అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ (game changer) ఆల్ ఓవర్ ఇండియా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. దీంతో చాలా మంది ప్రతి రోజు కూడా  సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంటుంది. ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి తదితరులు నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

శంకర్ (shankar) కలల  ప్రాజెక్ట్ అయిన గేమ్ చేంజర్ ని దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. బహుశా దిల్ రాజు కెరీర్ లోనే ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పవచ్చు.  కియారా అద్వానీ చెర్రీ కి జోడిగా నటిస్తుంది. ఇటీవల  చెర్రీ  పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన జరగండి సాంగ్ యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తుంది. పొలిటికల్ నేపథ్యంలో మూవీ  తెరకెక్కుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అందరిలో ప్రత్యేక ఆసక్తి ఉంది. 

click me!