ఆది-నిక్కీ నుంచి నాగ్- అమలా వరకూ...రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కపుల్స్ గా మారిన జంటలు

Published : May 23, 2022, 07:33 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిల్లు సహజం.. కాని అందులో తమ వివాహబంధాన్ని నిలబెట్టుకున్నవారు ఉన్నారు...  విడిపోయిన వారు ఉన్నారు.. ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరో హీరోయిన్లు  ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలా సినిమాలో కలిసి నటించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్స్ గురించి ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

PREV
113
ఆది-నిక్కీ నుంచి నాగ్- అమలా వరకూ...రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కపుల్స్ గా మారిన జంటలు

తాజాగా టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి - హీరోయిన్ నిక్కీ గల్రాని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మరకతమణి, మలుపు లాంటి సినిమాల్లో కలిసి నటించారు. మే 18న చెన్నైలో సింపుల్ గా  వీరి పెళ్లి జరిగింది. ఇన్నాళ్లూ ప్రేమికులుగా కొనసాగిన ఈ జంట.. ఇప్పుడు వివాహ బంధంతో భార్యాభర్తలుగా మారారు. 

213

రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటైన జంటలో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్ - అలియా భట్..  కూడా ఉన్నారు. దాదాపు 5 ఏళ్ళు డేటింగ్ చేసుకున్న వీరు... చాలా సింపుల్ గా.. కొద్ది మంది అతిదుల మధ్య ఏప్రిల్ 14న పెళ్ళి బంధంతో ఒకటయ్యారు. ఇక బాలీవుడ్ నుంచి రీసెంట్  గా పెళ్ళిబంధంతో ఒక్కటైన్ రీల్ కపుల్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్. సీక్రేట్ లవ్ ను మెయింటేన్ చేసిన ఈ జంట.. పెళ్ళి కూడా రహస్యంగానే చేసుకున్నారు. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

313

కింగ్ నాగార్జున, అమలది రీల్ లైఫ్ - రియల్ లైఫ్ లో తిరుగులేని జోడీ అనే చెప్పాలి. ముందుగా వీరు ఆన్ స్క్రీన్ లో చూపులు కలిసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. 30 ఏళ్లుగా అన్యోన్యమైన దాంపత్యాన్ని కొనసాగిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. నాగ్ - అమల 'కిరాయి దాదా' 'నిర్ణయం' 'శివ' లతో కలిపి 5 సినిమాల్లో  కలిసి నటించారు. ఈ క్రమంలో ప్రేమించుకొని 1992లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. 

413

టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్ అంటే మహేష్ ,నమ్రతలే గుర్తుకు వస్తారు. 2000 లో వంశీ సినిమాలో కలిసి నటించిన మహేష్ - నమ్రత జంట.. ఈ క్రమంలో ప్రేమలో పడి కొన్నాళ్ళు డేటింగ్ చేశారు. 2005లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.  ఇద్దరు పిల్లలతో ..పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ.. తన భర్తకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.
 

513

ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య సమంత ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు.  ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం లాంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రేమలో పడిన ఈ జంట..  2017లో పెద్దలను ఒప్పించి  పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకున్నారు. 
 

613

సూర్య సౌత్.. జ్యోతిక నార్త్.. 1999 లో పూవేల్లం కేట్టుప్పర్ సినిమాలో కలిసి నటించిన ఈ జంట.. ఆన్ స్క్రీన్ పై విజయవంతమైన జోడీ అనిపించుకున్నారు. ఆ సమయంలోనే ప్రేమలో పడి 2006 లో పెళ్లి చేసుకున్నారు.  అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీకగా నిలిచారు. 

713

దక్షిణాదిలో సినిమాల్లో నటించి తర్వాత రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారిన వారిలో అజిత్ - షాలిని జంట కూడా ఉన్నారు. 1999 లో వచ్చిన అమరకాలం సినిమాలో నటించిన అజిత్ తన సహ నటి షాలినితో ప్రేమలో పడ్డాడు. అదే ఏడాది ఆమెకు ప్రపోజ్ చేసి.. 2000 లో వివాహం చేసుకున్నారు. 

813

అలానే తమిళ నటుడు ప్రశన్న - హీరోయిన్ స్నేహ.. ఆర్య - సయేషా సైగల్.. కన్నడ హీరో ఉపేంద్ర - ప్రియాంక.. యష్ - రాధికా పండిట్ జంటలు కూడా  సినిమాల్లో కలిసి నటించి.. ప్రేమ వివాహం చేసుకున్నారు.

913

సూపర్ స్టార్ కృష్ణకు అప్పటికే పెళ్లి అయినప్పటికీ సినిమాల్లో తనతో కలిసి నటించిన విజయ్ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ నిర్మల చివరి శ్వాస వరకు కృష్ణతో కలిసి ఉండి సినీ ఆదర్శ జంటగా పేరు సంపాదించుకున్నారు. 

1013

 రాజశేఖర్ - జీవిత.. శ్రీహరి-డిస్కో శాంతి..  వంటి సినీ ప్రముఖులు కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కమల్ హాసన్ - సారిక ప్రేమించి పెళ్లి చేసుకొని.. కొన్నేళ్ల తర్వాత విడిపోయారు.

1113

ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్ మొదలుకొని.. వారి కొడుకు అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ వరకూ చాలా మంది సినీ జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. అమితాబ్ లాంటి వారు రీల్ రియల్ లైఫ్ పెళ్లితో ఆదర్శంగా నిలిస్తే.. అమితాబ్ కొడుకు అభిషేక్ కూడా ఐశ్వర్య రాయ్ ను చేసుకుని అదే బాటలో నడిచాడు. 
 

1213

అప్పటికే పెళ్ళి జరిగి.. పిల్లలు కూడా ఉన్న హీరో సైఫ్ అలీఖాన్ ను   ప్రేమించి.. ఏరి కోరి పెళ్లి చేసుకుంది కరీనా కపూర్. ఇద్దరు పిల్లలో సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. తెగ హడావిడిచేస్తున్నారీ జంట.  

1313

ఇక బాలీవుడ్ సక్సెస్ ఫుల్ కపుల్స్ లో రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకునే కూడా ఉన్నారు. అందరికి తెలిసేలా ప్రేమించుకుని.. ఫ్యాన్స్ అందరి మధ్యలో హ్యాపీగా పెళ్ళి చేసుకున్న ఈజంట.. ఎంచక్కా..  ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూ.. వివాహబంధానికి విలువనిస్తూ.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories