Karthika Deepam: నిరుపమ్ తో పెళ్లి చేస్తానని జ్వాలకు మాట ఇచ్చిన హిమ.. సౌందర్యకు షాకిచ్చిన స్వప్న!

Published : May 23, 2022, 07:31 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: నిరుపమ్ తో పెళ్లి చేస్తానని జ్వాలకు మాట ఇచ్చిన హిమ.. సౌందర్యకు షాకిచ్చిన స్వప్న!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ (Hima) మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అని జ్వాల (Jwala) కు మాటిస్తుంది. కానీ నేను చెప్పే వరకు నువ్వు నిరూపమ్ బావకు ఐ లవ్ యు చెప్పకూడదు అని అంటుంది. మరోవైపు సౌందర్య దంపతులు ఫోన్ చేసిన జ్వాల గురించి ఆలోచిస్తూ ఉంటారు.
 

26

ఈలోగా అక్కడకు స్వప్న (Swapna) వచ్చి తీపి కబురు అంటూ అమ్మానాన్నలకు స్వీట్లు పంచి శోభా (Sobha) ను వాళ్లకి పరిచయం చేస్తుంది. ఇక డాక్టర్ శోభా దేవి నాకు కాబోయే కోడలు అని చెబుతోంది. ఆ మాటతో సౌందర్య ఒకసారిగా స్టన్ అవుతుంది. అంతేకాకుండా నీ మనవరాలు ఎక్కడ.. నా కోడలు శోభా ఎక్కడ అంటుంది.
 

36

ఇక సౌందర్య (Sobha) శోభా చెంప మీద కమిలిపోయి ఉండడం గమనించి ఎవరో నిన్ను చెంప మీద కొట్టారు అంటూ శోభా స్వప్న (Swapna) ను అవమాన పరుస్తుంది. మరోవైపు నిరూపమ్ మనసు బాగోలేనందుకు జ్వాల ఆటోని నిరూపమ్ చేత డ్రైవింగ్ చేయిస్తుంది. దానికి నిరూపమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
 

46

ఇక జ్వాల (Jwala) నా మనసులోని మాట చెప్పడానికి ఇదే మంచి అవకాశమని మనసులో అనుకుంటుంది. మరోవైపు హిమ.. నిరూపమ్ (Nirupam) బావ నామీద కోపంతో సౌర్య ను బయటకు తీసుకు వెళ్ళాడు అని అనుకుంటుంది. ఇక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న సంగతి సౌర్య కు చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.
 

56

ఈలోపు అక్కడకు శోభా (Swapna), స్వప్న లు వచ్చి హిమ (Hima) కు తాను డాక్టర్ అనే విషయం తెలియజేస్తుంది. దాంతో హిమ ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇక స్వప్న నా కొడుకు ఎక్కడ అని అడుగుతుంది. హిమ ఈమె డాక్టర్ అవ్వడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు నిరూపమ్ నువ్వు చాలా గ్రేట్ తెలుసా అని జ్వాల తో అంటాడు.
 

66

అంతేకాకుండా నా ఫ్యామిలీ కోసమే నువ్వు పుట్టావు అనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటతో జ్వాల (Jwala) సంతోషం ఆపలేని విధంగా ఉంటుంది. ఈ క్రమంలో అక్కడికి శోభ వస్తుంది. నిరూపమ్ (Nirupam) ఒకరికి ఒకరిని పరిచయం చేస్తాడు. ఈ క్రమంలో శోభా సౌర్య ను దెప్పి పొడిచినట్టు గా రెండు మాటలు ఉంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories