గోదావరి బ్రిడ్జిపై 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ లాంచ్.. కనీవినీ ఎరుగని హంగామా, ఫొటోస్ వైరల్

Published : May 24, 2023, 10:02 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. 

PREV
110
గోదావరి బ్రిడ్జిపై 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ లాంచ్.. కనీవినీ ఎరుగని హంగామా, ఫొటోస్ వైరల్

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970, 80 దశకంలో స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. 

210

రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.  టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. వంశి అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

310

కాగా నేడు కనివిని ఎరుగని విధంగా టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఫస్ట్ లుక్ లాంచ్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు. 

 

410

రాజమండ్రి బ్రిడ్జిపై ట్రైన్ లోనుంచి ఫస్ట్ లుక్ ఫ్లెక్సీ అదిరిపోయే విధంగా లాంచ్ చేశారు. దీనితో బ్రిడ్జి వద్ద రవితేజ అభిమానులు భారీ ఎత్తున కనిపించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

510

ఫస్ట్ లుక్ లాంచ్ కి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ ఫొటోస్ ని మీకు అందిస్తున్నాము. రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఫస్ట్ లుక్ లో రవితేజ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా మాసీ లుక్ లో టెరిఫిక్ గా ఉన్నారు. 

610

గజదొంగ పాత్ర కాబట్టి అదుర్స్ అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ లాంచ్ లో దర్శకుడు వంశి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం కోసం ముందుగా వేరే హీరోలని అనుకున్నాం అని తెలిపారు. 

710

కానీ వారు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల  కుదర్లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులని రవితేజ మెప్పించగలరు. కాబట్టి ఆయనకి స్క్రిప్ట్ వినిపించినట్లు వంశి తెలిపారు. 

810

రాజమండ్రి బ్రిడ్జిపై ఈ చిత్రంలో అనేక పోరాట సన్నివేశాలు ఉంటాయి. రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి. కాబట్టే ఫస్ట్ లుక్ ని కూడా ఇక్కడే లాంచ్ చేయాలని అనుకున్నట్లు వంశి తెలిపారు. 

910

టైగర్ నాగేశ్వరా రావు జీవితంలో బయటపడని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. ఆయన చనిపోయాడని తెలిసి చూడడానికి సుమారు 3లక్షల మంది వెళ్లారు అని నా రీసెర్చ్ లో తెలిసింది అని వంశి అన్నారు. 

1010

టైగర్ నాగేశ్వర రావు వల్ల సాయం పొందినవారు దేశం మొత్తం ఉన్నారు. కాబట్టే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు. 

click me!

Recommended Stories