దేవుడా, రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ వల్ల భారీ నష్టం..ఉదయ్ కిరణ్ సినిమాపై తేజ ఓవర్ కాన్ఫిడెన్స్

Published : Feb 28, 2024, 01:31 PM ISTUpdated : Feb 28, 2024, 01:39 PM IST

సినిమా బిజినెస్ ఎప్పుడూ తలనొప్పి వ్యవహారమే. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప నిర్మాత సొమ్ము చేసుకోవడం కుదరదు. సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లో అనేక దశలు ఉంటాయి. ప్రతి దశలో నిర్మాత చాలా నేర్పరితనంతో ఉంటూ లాభం చూసుకోవాలి. 

PREV
16
దేవుడా, రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ వల్ల భారీ నష్టం..ఉదయ్ కిరణ్ సినిమాపై తేజ ఓవర్ కాన్ఫిడెన్స్

సినిమా బిజినెస్ ఎప్పుడూ తలనొప్పి వ్యవహారమే. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప నిర్మాత సొమ్ము చేసుకోవడం కుదరదు. సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ లో అనేక దశలు ఉంటాయి. ప్రతి దశలో నిర్మాత చాలా నేర్పరితనంతో ఉంటూ లాభం చూసుకోవాలి. టాలీవుడ్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెబుతుంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. మరీ ఇంత దారుణమా అని అనిపించక మానదు. 

 

26

మాస్ మహారాజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే వెంకీ చిత్రం పేరు కూడా చెప్పొచ్చు. రవితేజ కామెడీ టైమింగ్ ఈ చిత్రంలో నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ లో ఈ చిత్రం ఒక కల్ట్ సినిమాలా మిగిలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే 60 శాతం మీమ్స్ మొత్తం ఈ సినిమాలోనివే ఉంటాయి. 

 

36
srinu vaitla

బ్రహ్మానందం, రవితేజ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ నెవర్ బిఫోర్.. ఇద్దరూ తమ ముఖకవళికలతో నవ్వులు పూయించారు. ఈ చిత్రం కూడా థియేటర్స్ లో ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ఘనవిజయం సాధించింది. కానీ తాజాగా ఇంటర్వ్యూలో స్వయంగా ఈ చిత్ర నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు చేసిన వ్యాఖ్యలు చేస్తే షాక్ తప్పదు. 

 

46

ఎందుకంటే తనకి వెంకీ చిత్రం లాస్ మూవీ అని ఆయన తేల్చేశారు. ఆయన మాట్లాడుతూ వెంకీ చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచింది. బయ్యర్లందరికి లాభాలు వచ్చాయి. కానీ తనకి మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం 60 లక్షల వరకు నష్టాలు మిగిల్చినట్లు పూర్ణచంద్ర రావు తెలిపారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ వల్ల నిర్మాతకి నష్టాలు అంటే టాలీవుడ్ లో బిజినెస్ ఎంత తికమకగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

 

56

ఉదయ్ కిరణ్ ఔనన్నా కాదన్నా చిత్రాన్ని నిర్మించింది కూడా ఆయనే. ఈ మూవీ కూడా భారీగా నష్టాలు తెచ్చిపెటింది అట. రాంగోపాల్ వర్మ ద్వారా డైరెక్టర్ తేజ తనకి పరిచయం అయినట్లు పూర్ణచంద్రరావు తెలిపారు. తేజ హుషారు, ఇంటెలిజెన్స్ చూసి డైరెక్టర్ అవ్వమని సలహా ఇచ్చా. కొన్నేళ్ల తర్వాత తేజ చిత్రం మూవీతో హిట్ కొట్టాడని విన్నా. కంగ్రాట్స్ చేయడానికి ఫోన్ చేస్తే మీరెప్పుడు చేస్తారు నాతో సినిమా అని అడిగాడు. 

 

66

నువ్వు కథ రెడీ చెయ్ నేను చేస్తా అని చెప్పా. కొన్నేళ్ల తర్వాతా ఉదయ్ కిరణ్ తో ఔనన్నా కాదన్నా చిత్రం కుదిరింది. షూటింగ్ మొత్తం రాజమండ్రిలోనే జరిగింది. సినిమా పూర్తయ్యాక.. అంత సంతృప్తిగా లేదు అని చెప్పా. మీరు ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువ చూడడం లేదు కదా అని తేజ కాస్త వ్యంగ్యంగా అన్నారు. తాను ఊహించినట్లుగానే ఔనన్నా కాదన్న చిత్రం తీవ్ర నష్టాలని మిగిల్చినట్లు ఆయన తెలిపారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories