Khiladi Review: `ఖిలాడి` ప్రీమియర్స్ రివ్యూ.. రవితేజ మళ్లీ మోత మోగించినట్టేనా?

Published : Feb 11, 2022, 07:56 AM IST

మరోసారి హార్డ్ టైమ్‌లో వస్తున్నాడు రవితేజ.  ఆయన నటించిన `ఖిలాడి` చిత్రం థర్డ్ వేవ్‌ తర్వాత రిలీజ్‌ అవుతున్న మొదటి బిగ్‌ మూవీ కావడం విశేషం. రమేష్‌ వర్మ దర్శకత్వంలో డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్‌ హీరో అర్జున్‌, మలయాళ నటుడు ఉన్నిముకుందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతుంది. 

PREV
17
Khiladi Review: `ఖిలాడి` ప్రీమియర్స్ రివ్యూ.. రవితేజ మళ్లీ మోత మోగించినట్టేనా?

మాస్‌ మహారాజా Raviteja వరుస ఫ్లాప్‌ ల తర్వాత `క్రాక్‌` చిత్రంతో బంపర్‌ హిట్‌ అందుకుని మళ్లీ పుంజుకున్నారు. కెరీర్‌కి పూర్వ వైభవం వచ్చింది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత సంక్రాంతికి వచ్చిన `క్రాక్‌` చిత్రం `హార్డ్ టైమ్‌లోనూ విడుదలై సక్సెస్‌ సాధించడం విశేషం. ఇప్పుడు మరోసారి హార్డ్ టైమ్‌లో వస్తున్నాడు రవితేజ(Raviteja).  ఆయన నటించిన `ఖిలాడి` చిత్రం థర్డ్ వేవ్‌ తర్వాత రిలీజ్‌ అవుతున్న మొదటి బిగ్‌ మూవీ కావడం విశేషం. రమేష్‌ వర్మ దర్శకత్వంలో డింపుల్‌ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్‌ హీరో అర్జున్‌, మలయాళ నటుడు ఉన్నిముకుందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతుంది. 

27

`క్రాక్‌` సినిమా హిట్‌ కావడంతో Khiladi చిత్రంపై భారీ అంచనాలున్నాయి. పైగా `రాక్షసుడు` తర్వాత దర్శకుడు రమేష్‌ వర్మ రూపొందించిన చిత్రం కావడం కూడా అంచనాలకు ప్లస్‌ అయ్యింది. కోనేరు సత్యానారాయణ నిర్మించిన ఈ చిత్రం ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. అయితే ఇండియాలో షోలు పడటానికి ముందు యూఎస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడి టాక్‌ ఎలా ఉంది. అక్కడి ఆడియెన్స్ సినిమాని ఎలా ఫీలవుతున్నారో `ప్రీమియర్‌ రివ్యూ`(Khiladi Premier Review)లో తెలుసుకుందాం. 

37

సినిమా ఓ రొటీన్‌ యాంగిల్‌లో ప్రారంభమైంది. ఫ్యామిలీ క్రైమ్‌ కేసులో రవితేజ శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉంటాడు. ఆయన పేరు మోహన్‌ గాంధీ. హీరోయిన్‌ మీనాక్షి సైకాలజీ స్టూడెంట్‌. గాంధీపై థిసీస్‌కి సంబంధించి తన స్నేహితులకు హెల్ప్ చేస్తూ కనిపిస్తుంది. కట్‌ చేస్తే ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తుంది సినిమా. రవితేజ.. తొలి చూపులోనే మురళీశర్మ కూతురు చిత్ర(డింపుల్‌ హయతి) ప్రేమలో పడతాడు. ప్రేమ పీక్‌లోకి వెళ్లిన సమయంలో లిప్‌లాక్‌ ఇచ్చుకుంటారు. దీంతో `ఫుల్‌ కిక్క్‌` సాంగ్‌ వస్తుంది. ఈ పాటలో డింపుల్‌ స్కిన్‌ షోకి హద్దులు లేవని చాటుకుంది. ప్రారంభంలోనే గ్లామర్‌ మీల్స్ పెట్టిందని చెప్పొచ్చు. 

47

ఆ తర్వాత అర్జున్‌ ఎంటరవుతారు. ఆయన చాలా కఠినమైన సీబీఐ ఆఫీసర్‌. పేరు అర్జున్‌ భరద్వాజ్. అప్పటి వరకు సరదాగా సాగిన కథ.. అర్జున్‌ ఎంట్రీతో సీరియస్‌ మూడ్‌లోకి వెళ్తుంది. ప్రమాదంలో ఇరుక్కున్న రావు రమేష్‌ ని దాన్నుంచి రవితేజ కాపాడాల్సి వస్తుంది. మొదటి భాగం వరకు కామెడీ, రొమాన్స్ మీదే సాగుతుంది. అయితే అది కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. బోరింగ్‌గా సాగుతుంది. సాగదీతగా అనిపిస్తుంటాయి. మనీ చుట్టూ సినిమా కథ సాగుతుంది. కానీ ఆ విషయాన్ని సరైన విధంగా ఆవిష్కరించలేదు. ప్రీ ఇంటర్వెల్‌ సీక్వెన్స్ సిల్లీగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్ పర్వాలేదనిపిస్తుంది. ఫస్టాప్‌ ఏమాత్రం కిక్కు ఇవ్వలేదు. అసలు కథ రెండో భాగంలో ఉండటంతో దానిపైనే అంచనాలున్నాయి. 

57

సెకండాఫ్‌లో రవితేజ అసలు కథ రివీల్‌ అవుతుంది. సీబీఐ ఆఫీసర్‌ అర్జున్‌ ఎంట్రీ ఎందుకు జరిగింది, రవితేజ జైలుకి ఎందుకెళ్లాడనేది తెలియజేస్తారు. ఈ సన్నివేశాలు ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. ఏం జరగబోతుందనేది ఊహించని విధంగా ఉంది. ఆ తర్వాత `అట్ట సూడకే.. `పాట వస్తుంది. డాన్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇందులో మీనాక్షి చౌదరి హాట్‌నెస్‌తో ఉర్రూతలూగించింది. రవితేజ, మీనాక్షి ల ఎనర్జీ హైలైట్‌. 

67

ఫైనల్‌గా సినిమా ఓ సాధారణ కమర్షియల్‌ చిత్రంగా అనిపిస్తుంది. ఇందులో చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి. కథని సరైన విధంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడి ఫెయిల్యూర్‌ కనిపిస్తుంది. రవితేజ అంటే ఫుల్‌ ఎనర్జీ. కానీ ఇందులో ఆయన పాత్రని ఆ స్థాయిలో ఆవిష్కరించలేకపోయాడు దర్శకుడు. దీంతో సినిమా చప్పగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను నీరుగార్చిందని యూఎస్‌ ప్రీమియర్స్ టాక్‌ ద్వారా తెలుస్తుంది. కేవలం హాట్‌గా, మాస్‌గా సాగే పాటలు తప్ప సినిమాలో మ్యాటర్‌ లేదని టాక్‌.

77

నిజానికి చిత్రాన్ని సరైన విధంగా ప్రమోషన్‌ కూడా చేయలేదు. ఫలితం తెలిసి ప్రమోషన్‌ కూడా వేస్ట్ అనుకున్నారో ఏమో, ఏదో ఒకటి అర ప్రమోషన్లతో లాగించేశారు. దీంతోనే ఆడియెన్స్ కి అసలు విషయం చెప్పారని అర్థమవుతుంది. అదే సమయంలో యూఎస్‌ రిపోర్ట్ ని బట్టి సినిమాని జడ్జ్ చేయలేం. అక్కడి వారి టేస్ట్, మన టేస్ట్ వేరేలా ఉంటుంది. మరి కాసేపట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మార్నింగ్‌ షోలు పడుతున్నాయి. ఇక్కడి ఆడియెన్స్ కి సినిమా నచ్చుతుందా? లేదా? అనేది అసలైన రివ్యూలో తెలుసుకుందాం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories