Khiladi Review: ఖిలాడి సినిమా ట్విట్టర్ రివ్యూ… ఆడియన్స్ ఏమంటున్నారంటే..?

First Published | Feb 11, 2022, 7:07 AM IST

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja). ఏజ్ పెరుగుతున్న కొద్ది జోష్ కూడా పెరుగుతుంది. ఈ కరోనా పాండమిక్ టైమ్ లో  కూడా గతంలో డిస్కోరాజ, క్రాక్ లాంటిసినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ ఇపుడు ఖిలాడి సినిమాతో సందడి చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ రవితేజ(Ravi Teja) హిందీ మార్కెట్ మీద కూడా కన్నేశాడు.

రెండేళ్ళుగా కరోనా ఫిల్మ్ ఇండస్ట్రీని వేధిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి వెనకాడుతున్న టైమ్ లో.. మాస్ మహారాజ్ (Ravi Teja) మాత్రం అందరికంటే ఒక అడుగుముందే ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఖిలాడి సినిమాను రిలీజ్ చేయగలిగాడు.తెలుగుతో పాటు హిందీలో కూడా ఖిలాడి రిలీజ్ అయ్యింది.

రవితేజ(Ravi Teja), మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతీ జంటగా.. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది ఖిలాడి సినిమా. ఈరోజు (ఫిబ్రవరి  11)న ఈ సినిమా రిలీజ్ అవ్వగా.. అంతకంటే ముందు ఓవర్ సిస్ లో ప్రిమియర్ రిలీజ్ అయిపోయింది ఖిలాడి సినిమా. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియ చేస్తున్నారు.


మెజారిటీ ఆడియ్స్ ఖిలాడి సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ మూవీ పై పెదవి విరుస్తున్నారు. సెకండ్ హాఫ్ మూవీ ఇంకొంచెం సాలిడ్ గా ఉంటే బాగుండేది అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మూవీ మాత్రం అలరించిందంటూ ట్వీట్ చేస్తున్నారు.

మరికొంత మంది మాత్రం ఫస్ట్ వన్ అవర్ సినిమా అదరగొటిందంటున్నారు. సినిమాను బ్రతికించడానికి ఈ వన్ అవర్ చాలంటున్నారు మరికొంతమంది ఆడియన్స్.  ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఊహించలేం.. అంత అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేస్తున్నారు ఖిలాడి చూసిన ఫారెన్ ప్రేక్షకులు.

ఎప్పటిలాగానే మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)పెర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. రవితేజ్ మార్క్ డైలాగ్స్.. ఆయన మార్క్ మ్యానరిజంతో దూసుకుపోయాడంటున్నారు ఆడియన్స్. అటు ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ (Arjun) పర్ఫామెన్స్ కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఆయన ఏ పాత్ర చేసినా.. తన పర్ఫామెన్స్ తో అదరగొడతాడంటున్నారు ఫ్యాన్స్.

ఇక ఈమూవీకి స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్లు మీనాక్షీ చౌదరి, డింపుల్ హయత్ మారిపోయారు ఖిలాడికి అదిరిపోయేలా గ్లామర్ అద్దరు ఈ ఇద్దరు భామలు. ఆడియన్స్ ను థియేటర్ లో లాక్ చేసేలా.. ఈ ఇద్దరు బ్యూటీల పెర్ఫామెన్స్ ఖిలాడికి కలిసొచ్చిందనే అంటున్నారు.

మంచి అంచనాలతో రిలీజ్ అయ్యింది ఖిలాడి సినిమా. ప్రిరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 22 కోట్ల ప్రిరిలీజ్ జరిగినట్టు సమాచారం. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ఖిలాడి రిలీజ్ కు రెడీ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాపైభారీగానే ఆశలు పెట్టుకున్నాడు రవితేజ్(Ravi Teja). డిస్కో రాజ, క్రాక్ సినిమాలు అనకున్నంతగా ఫిలితాన్ని ఇవ్వకపోవడంతో ఖిలాడి సినిమా సక్సెస్ ఇప్పుడు మాస్ మహారాజ్ (Ravi Teja)కు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా సక్సెస్ అయితే ఆతరువాత లిస్ట్ లో ఉన్న రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా లాంటి సినిమాలపై ఈ ప్రభావం గట్టిగానే చూపించే అవకాశం ఉంది.

ఫస్ట్ హాఫ్ మాత్రమే పాజిటీవ్ రావడం.. సెకండ్ హాఫ్ మూవీపై ఫారెన్ ఆడియన్స్ పెదవి విరవడంతో.. సినిమా మన దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు నచ్చినా.. ఓవర్ ఆల్ గా సినిమా సక్సెస్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.   

Latest Videos

click me!