Mahesh, Vijay Fans War: మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్

Published : Feb 10, 2022, 05:31 PM IST

తెలుగు అయినా.. తమిళ్ అయినా.. స్టార్ హీరో అంటే భారీ గా ఫ్యాన్స్ ఉంటారు.  ఆఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ తో గొడవపడుతూనే ఉంటారు. ఇదేదో ఆచారంలా ఎప్పటి నుంచో కనిపిస్తున్న తంతే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. సోషల్ మీడియాలో రెచ్చిపోయి తిట్టుకుంటున్నారు అభిమానులు.

PREV
18
Mahesh, Vijay Fans War: మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్

టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు, తమిళ ఇళయదళపతి విజయ్  సౌత్ లో ఈ ఇద్దరు హీరోలు స్టార్సై.. ఇద్దరి ఫాలోయింగ్ ను తక్కువ చేయలేం. ఇద్దరికి దగ్గరగా ఒకే వయస్సు. సౌత్ లో  భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోలు...భారీ ఫ్యాన్స బేస్ లో కెరీర్ లో పరుగులు తీస్తుననారు. కాని వీరి ఫ్యాన్స్ మాత్రం శత్రువుల్లా తిట్టుకుంటూ ఈ హీరోలకు లేని పోని తలనొప్పులు తెస్తున్నారు.

28

సూపర్ స్టార్ మహేశ్ నటించిన ఒక్కడు, పోకిరి లాంటి చాలా సినిమాలను తమిళంలో విజయ్ రీమేక్ చేశారు. రీమేక్ చేయడమే కాదు సూపర్ హిట్ కొట్టారు కూడా.  ఈ సందర్భంగా ఈ  ఇద్దరు హీరోల మధ్య మంచి ఫ్రెండ్ షిప్  కూడా డెవలప్ అయ్యింది. వీరి ఫ్యామిలీల మద్య కూడా  చక్కటి అనుబంధం ఉంది.

38

సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ జరిగుతుంది. నిజానికి ఈ తరహా ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరగటం కొత్త కాదు. తరచుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మహేశ్, విజయ్ అభిమానుల వంతు వచ్చింది. అయితే వీరి వార్ కి సిల్లీ  కారణం తప్పలించి భారీ రీజన్ మాత్రం కనిపించడం లేదు.

48

మహేష్ బాబు నటించిన  సర్కార్ వారి పాట మొదటి సింగిల్ ఫిబ్రవరి 14 న రిలీజ్ కానుంది. ఇక అదే రోజు విజయ్ బీస్ట్ సింగిల్ కూడా విడుదల కాబోతోంది. తమ తమ హీరోల పాటలను హ్యాపీగా ఆస్వాదించటానికి రెడీ అవ్వాల్చిన అభిమానులు ట్విట్టర్‌లో ఫైట్‌ మొదలెట్టారు.

58

యూట్యూబ్‌లో బీస్ట ట్రాక్ లైక్స్ ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్ ను ఉపయోగిస్తారని మహేష్ ఫ్యాన్స్ ఆరోపించారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ మహేష్ అభిమానులు ఫౌల్ క్రై చేస్తున్నారంటూ దండయాత్ర మొదలు పెట్టారు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆ పై నెగిటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలెట్టారు.

68

ఈ రెండు సినిమాల పాటలు విడుదల కావటానికి చాలా టైమ్ ఉన్నా వీరి ఫ్యాన్‌ వార్ మాత్రం తారాస్థాయిని చేరింది. హీరోలు తమతమ అభిమానులను దురభిమానం చూపించవద్దని కోరుతున్నా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి మహేశ్, విజయ్ సినిమాలలో పాటలు రిలీజ్ అయిన తర్వాత ఈ వార్ ఇంకెంతటి తీవ్రస్థాయికి చేరుతుందో చూడాలి.

78

గతంలో కూడా ఈ ఇద్దరి ఫ్యాస్ మధ్య వార్ గట్టిగానే నడిచింది. లాస్ట్ ఇయర్.. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వీరి ఫ్యాన్స్ సోషల్ మీడిమాలో గట్టిగానే తిట్టుకున్నారు. డమ్మీ స్టార్ మహేష్ బాబు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటే.. రీమేక్ స్టార్ విజయ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎదురు దాడి చేశారు.

88

అటు తమిళనాట కూడా విజయ్ ఫ్యాన్స్ దూకుడు గట్టిగానే కనిపస్తుంది. విజయ్ ఫ్యాన్స్ కు తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్స్ కు అయితే అస్సలు పడదు. బాహాటంగా ఘర్షణ పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. స్టార్స్ అంతా మేమంతా ఫ్రెండ్లీగా ఉంటాం, మీరు కూడా అంతే ఉండండి అని ఎంత అడుగుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం శత్రువుల్లా తగవులాడుతూనే ఉన్నారు.

click me!

Recommended Stories