ఆ ఒక్క కారణంతో యంగ్ డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన రవితేజ.. అతడే ఇప్పుడు 300 కోట్లు ఉఫ్ అని ఊదేస్తున్నాడు

Published : Jan 21, 2026, 03:57 PM IST

గతంలో రవితేజ ఓ యంగ్ డైరెక్టర్ సినిమాని రిజెక్ట్ చేశారు. రవితేజ తన కెరీర్ లో తీసుకున్న చెత్త నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. అది ఎందుకు చెత్త నిర్ణయమో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
ఇబ్బందుల్లో రవితేజ కెరీర్ 

మాస్ మహారాజ్ రవితేజకి ప్రస్తుతం కెరీర్ లో ఇబ్బందులు తప్పడం లేదు. చాలా కాలంగా రవితేజ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి విడుదలయింది. ఈ చిత్రం పర్వాలేదనిపించింది కానీ పూర్తి స్థాయిలో హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ మార్కెట్ క్రమంగా డౌన్ అవుతోంది అని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరోవైపు సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్, అనిల్ రావిపూడి ల చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. 

25
హిట్ మెషీన్ గా మారిన దర్శకుడు 

అనిల్ రావిపూడి, రవితేజ మధ్య గతంలో ఆసక్తికర సంఘటన జరిగింది. అనిల్ రావిపూడి పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ లో హిట్ మెషీన్ గా మారిపోయారు. పటాస్ నుంచి మన శంకర వరప్రసాద్ గారు వరకు అనిల్ తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

35
ఆ సినిమా రిజెక్ట్ చేసిన రవి తేజ 

అనిల్ రావిపూడి విషయంలో రవితేజ ఒక చెత్త నిర్ణయం తీసుకున్నారు. పటాస్ సినిమా కథని అనిల్ మొదట నెరేట్ చేసింది రవితేజ కే. కానీ ఆ సమయంలో రవితేజ దరువు అనే సినిమా చేయడానికే మొగ్గు చూపాడు. దీనితో పటాస్ సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి పటాస్ సినిమాని కళ్యాణ్ రామ్ తో చేసి సూపర్ హిట్ అందుకున్నారు. 

45
రవితేజ అట్టర్ ఫ్లాప్ మూవీ 

రవితేజ నటించిన దరువు మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. రవితేజ తీసుకున్న చెత్త నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. పటాస్ హిట్ అయ్యాక ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశానా అని రవితేజ బాధపడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత కాలంలో రవితేజ, అనిల్ కాంబినేషన్ లో రాజా ది గ్రేట్ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ హిట్ అయింది. 

55
300 కోట్లు ఉఫ్ అని ఊదేస్తున్నాడు 

ఇప్పుడు అనిల్ రావిపూడి సంక్రాంతి డైరెక్టర్ గా మారిపోయారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు అలవోకగా రాబడుతున్నాయి. అనిల్ చేసేది భారీ పాన్ ఇండియా చిత్రాలు కాదు.. రీజియనల్ ఆడియన్స్ కోసం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేస్తుంటారు. అలాంటి సినిమాలతో 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు. 

Read more Photos on
click me!

Recommended Stories