Ravanasura Review: 'రావణాసుర' ప్రీమియర్ టాక్.. విలనిజం, ఫన్ తో దంచేసిన రవితేజ.. హ్యాట్రిక్ ఛాన్స్

Published : Apr 07, 2023, 06:14 AM IST

 మాస్ మహారాజ్ ఇప్పుడు రావణాసురగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ యుఎస్ లాంటి ప్రాంతాల్లో ప్రీమియర్ షోలతో స్టార్ట్ అయింది. 

PREV
17
Ravanasura Review: 'రావణాసుర' ప్రీమియర్ టాక్.. విలనిజం, ఫన్ తో దంచేసిన రవితేజ.. హ్యాట్రిక్ ఛాన్స్

చాలా కాలం తర్వాత రవితేజ ధమాకా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన మాస్ పవర్ చూపించారు. ఆ మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అలాగే వాల్తేరు వీరయ్యలో రవితేజ పోషించిన గెస్ట్ రోల్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. అదే జోరులో మాస్ మహారాజ్ ఇప్పుడు రావణాసురగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ యుఎస్ లాంటి ప్రాంతాల్లో ప్రీమియర్ షోలతో స్టార్ట్ అయింది. 

27

ఈ చిత్రంలో దక్ష నగార్కర్, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ లాంటి కూర హీరోయిన్లు నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. రావణాసుర చిత్రం ఆసక్తికరంగా మొదలై ఆ తర్వాత కాస్త నెమ్మదిగా మారుతుంది. 

37

ఈ చిత్రంలో రవితేజ రవీంద్ర అనే లాయర్ పాత్రలో కనిపిస్తారు. అతనికి ఒక మర్డర్ కేసు వస్తుంది. ఆ కేసులో కొందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేదే కథలో ఆసక్తికరం. మొదటి 20 నిమిషాలు డైరెక్టర్ స్లోగా తీసుకువెళుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మూవీ పిక్ అప్ అయి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సూపర్ టెంపో మైంటైన్ చేశారు. 

47

ఇంటర్వెల్ సన్నివేశం అయితే అద్భుతంగా వర్కౌట్ అయింది. చాలా రోజుల తర్వాత రవితేజ యాక్షన్, కామెడీ, నెగిటివ్ షేడ్స్ ఇలా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ ఇచ్చింది చిత్రం ఇది. దర్శకుడు సుధీర్ వర్మ స్వామి రారా తర్వాత ఆ తరహా ఇంపాక్ట్ చూపించలేదు. ఈ చిత్రంలో సుధీర్ వర్మ తన స్క్రీన్ ప్లే ప్రతిభని మరోసారి చూపించారు. 

57

నెగిటివ్ షేడ్స్ లో రవితేజన ఒక విలన్ లాగా చూపిస్తూ సుధీర్ వర్మ మాస్ మహారాజ్ క్యారెక్టర్ ని ఆసక్తికరంగా మలిచారు. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్ట్ హాఫ్ ముగుసుస్తుంది. అంతే స్ట్రాంగ్ గా సెకండ్ హాఫ్ సైతం మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా రవితేజ తన పెర్ఫామెన్స్ తో కథని రక్తి కట్టిస్తూ ముందుకు నడిపారు. సాలిడ్ సీన్స్ పడ్డాయి. 

67

కానీ క్లైమాక్స్ కి రీచ్ అయ్యే సరికి కాస్త ఊహించదగినదిగా మారుతుంది. దీనితో క్లైమాక్స్ లో కిక్కి కొంచెం మిస్ అయిందనే చెప్పాలి. కానీ తీసిపడేసే విధంగా అయితే క్లైమాక్స్ ఉండదు. హర్ష వర్ధన్ ఈ చిత్రానికి అవసరమైన మంచి బిజియం ఇచ్చారు. ఆయన బిజియంతో చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. ఇక హీరోయిన్ పాత్రలు సోసో గానే ఉన్నాయి. సుశాంత్ కి మంచి ప్రాధాన్యత ఉన్న రోల్ దక్కింది. 

77

ఓవరాల్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసుర చిత్రం రవితేజకి బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ మూవీ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. నెగిటివ్ షేడ్స్ లో రవితేజ నటన ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. థ్రిల్, కామెడీ, యాక్షన్ అంశాలతో రవితేజ తన ఫ్యాన్స్ కి మంచి ప్యాకేజ్ ఇచ్చారు అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత వరుస ఫ్లాపుల నుంచి సుధీర్ వర్మకి రావణాసుర చిత్రం రిలీఫ్ ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. 

click me!

Recommended Stories