Ravanasura Review:రవితేజ రావణాసుర మూవీ ట్విట్టర్ రివ్యూ.. మాస్ మహారాజ్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

First Published | Apr 7, 2023, 6:04 AM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. ఐదుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా.. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమా రావణాసుర. రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఈసినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడ చేయబోతోంది. అయితే యూఎస్ లో ప్రీమియర్స్ పడగా.. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఇంతకీ రవితేజ సినిమాపై ట్విట్టర్ జనాల టాక్ ఏంటీ..? 
 

ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో సందడి చేయబోతున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఆమధ్య థమాకాతో హిట్టు కొట్టిన మాస్ మహారాజ్.. ఇప్పుడు రావణాసుర మూవీతో సూపర్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. అందకే పక్కా ప్లాన్ తో ఈమూవీని చేశాడు. మరి ఈసినిమా ఎంత వరకూవర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్విట్టర్ లో ఈసినిమా గురించి ఆడియన్స్ అభిప్రాయం ఏంటి..? ఏమంటున్నారు చూద్దాం. 

రావణాసుర సినిమాలో రవితేజ్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఒక ఎత్తు అయితే... రవితేజ కోసం ఈసినిమాలో  ఐదుగురు హీరోయిన్లు  నటించడం మరో ఎత్తు. అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, పూజిత పోన్నాడతో పాటు దక్ష  ఈ మూవీలో సందడి చేశారు.  అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో  ఈసినిమా తెరకెక్కింది. 


రావణాసుర సినిమాపై పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా చాలా వరకూ ఆడియన్స్ కు నచ్చినట్టే అనిపిస్తుంది. రవితేజ ఇంట్రో నుంచి ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ మూవీ వరకూ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసినట్టు ట్వీట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ పర్ఫామెన్స్ సూపర్ గా ఉంది అంటున్నారు. ఈసినిమాలో కాస్తడిఫరెంట్ గా కనిపించాడట మాస్ మహారాజ్. 

మరికొంత మందిమాత్రం ఫస్ట్ హాఫ్ ఒకే పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మూవీ దుమ్ము రేపింది అంటున్నారు.ముఖ్యంగా ఇంట్రవెల్ ట్విస్ట్ అదరగొట్టారంటూ ట్వీట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో నెగెటీవ్ షేడ్ తో కపిస్తే.. సెకండ్ హాఫ్ మూవీ మొత్తం పాజిటీవ్ వైబ్రేషన్స్ తో సినిమా సాగుతుందట. అంతే కాదు..  సాంగ్స్.. రవితేజ క్యారక్టరైజేషన్ అంతా సూపర్ గా  ఉంది అంటున్నార ట్విట్టర్ ఆడియన్స్. 
 

ఇక ఈమూవీలో రవితేజ తో పాటుగా అక్కినేని హీరో.. సుశాంత్‌  కూడా కీలకపాత్రలో నటించాడు. సుశాంత్ పాత్రపై కొంత మంది ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు..మరికొంత మంది మాత్రం బావుంది అంటున్నారు. అయితే అందరూ అనేది మాత్రం ఇచ్చిన పాత్ర ఏదైనా..సుశాంత్ పెర్ఫామెన్స్ మాత్రం బాగుంది అంటున్నారు. కాని క్యారెక్టర్ కాస్త బాగా డిజైన్ చేయాల్సింది అంటున్నారు ఆడియన్స్. 

ఇక ఈ సినిమాపై పాజిటీవ్ ట్వీట్లు మాత్రమే కాదు..నెగెటీవ్ రివ్యూస్ కూడా కనిపిస్తున్నాయి. మూవీలో రవితేజ పాత్ర బాగున్నా.. సినిమా బాలేదంటూ చాలామంది ట్వీట్ చేస్తున్నారు. సినిమాలైన్ ఇంట్రెస్టింగ్ గా లేదంటున్నారు. స్క్రీన్ ప్లూ చాలా పూర్ గా  ఉందంటూ ట్వీట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మూవీ అంతా ధారణంగా ఉంది. అంటున్నారు. 

అంతే కాదు రావణాసుర సినిమా గురించి ఎక్స్ పెక్ట్ చేసి వచ్చేవారికి నిరాశ తప్పదూ అంటూ నెగెటీవ రివ్యూస్ కనిపిస్తున్నాయి ట్విట్టర్ లో.. వావ్ అనిపించేలా మంచి మూమెంట్ ఏమీ అవేవు... కొత్తగా కావాలి అనుకుని వస్తే మాత్రం నిరాశ తప్పదంటున్నారు. ఇక ఈసినిమాపై ఇంకా రకరకాలుగా రివ్యూస్ వస్తున్నాయి. హీరో్యిన్ల గ్లామర్ మాత్రం సినిమాకు బాగా కలిసొచ్చిందట. 
 

ఇక థమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టై బ్యాక్ హిట్ కొట్టిన రవితేజకు రావణాసుర హ్యాట్రిక్ హిట్ అందిస్తుందా లేదా అనేది చూడాలి. ఈసినిమా తరువాత మరో రెండు సినిమాల స్పీడ్ పెంచాడు రవితేజ. మరి ఈసినిమా బాక్సాఫిస్ దగ్గర ఎలాంటిప్రభావం చూపిస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!