మాస్ మహారాజ్ రవితేజ ఎనెర్జీ లెవల్స్ మాములుగా ఉండవు. కామెడీ అయినా, యాక్షన్ అయినా, డ్యాన్స్ అయినా తనదైన స్టైల్ లో రవితేజ అదరగొట్టేస్తారు. అందుకే మాస్ లో రవితేజకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రవితేజ చాలా మంది స్టార్ డైరెక్టర్లతో పనిచేసారు.
రాజమౌళితో సైతం రవితేజ వర్క్ చేశారు. రాజమౌళి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం విక్రమార్కుడు. ఈ చిత్రంలో రవితేజ కామెడీ యాంగిల్ ని, సీరియస్ మాస్ యాంగిల్ ని రాజమౌళి ఫుల్ గా వాడుకున్నారు. చిల్లర దొగతనాలు చేసే అత్తిలి సత్తిబాబుగా.. క్రిమినల్స్ ని చీల్చి చెండాడే ఏసిపి విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టేశారు.
ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన సరదా సంఘటనని రవితేజ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ మూవీలో ఆడోళ్లతో జుట్టులు పట్టుకుని గొడవపడే సీన్ ఒకటుంటుంది. చిన్న పిల్లలని ఏడిపిస్తున్నాడని ఆడోళ్ళంతా రవితేజతో గొడవ పెట్టుకోవడానికి వస్తారు.
రవితేజ వాళ్ళతో గొడవపడే సమయంలో సీన్ అయ్యాక కూడా రాజమౌళి కట్ చెప్పడం లేదట. ఎందుకు కట్ చెప్పడం లేదు అని చూస్తే రాజమౌళి మానిటర్ పట్టుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాడు. చుట్టూ చూశా.. సెట్ లో 200 మంది ఉన్నారు.
ప్రతి ఒక్కరూ అదే విధంగా నవ్వుతూ గోల గోల చేస్తున్నారు. ఎవ్వరిని ఆపడం కుదరడం లేదు. ఆ రెస్పాన్స్ చూసి షాక్ అయ్యా. నాకు దానికి మించిన అవార్డు అక్కర్లేదు అంటూ రవితేజ ఎమోషనల్ గా చెప్పారు.
విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మధ్య కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రవితేజ, బ్రహ్మానందం దొంగతనంలో పార్ట్నర్స్ గా ఉంటారు.