BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ

Published : Dec 19, 2025, 08:31 PM IST

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్ర టీజర్ విడుదలైంది. ఈ చిత్రంతో రవితేజ మాస్ జోనర్ ని వదిలిపెట్టి కొత్తగా ట్రై చేస్తున్నాడు. టీజర్ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
రవితేజ వరుస ఫ్లాపులు 

మాస్ మహారాజ్ రవితేజకి ఇటీవల అంతగా కలిసిరావడం లేదు. వరుస డిజాస్టర్ సినిమాలు ఎదురవుతున్నాయి. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, ఈగల్ ఇలా రవితేజ నటించిన సినిమాలు అభిమానులని నిరాశ పరుస్తూనే ఉన్నాయి. రవితేజ చేస్తున్నది రొటీన్ మాస్ సినిమాలు అనే విమర్శ కూడా ఉంది. 

25
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ 

ఇలాగే ఏమాత్రం ఆకట్టుకోని మాస్ సినిమాల్లోకి చేస్తూ పోతే రవితేజ మార్కెట్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీనితో పరిస్థితి రవితేజ గమనించినట్లు ఉన్నాడు. అందుకే తన నెక్స్ట్ మూవీతో రూటు మార్చబోతున్నాడు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోంది. 

35
సంక్రాంతికి రిలీజ్ 

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ ని బట్టి చూస్తే పెళ్ళైన వ్యక్తి మరో అమ్మాయిపై మనసు పడితే పరిణామాలు ఎలా ఉంటాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ఉంది. ఈ కథతో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ కిషోర్ తిరుమల తాను ఎలా డీల్ చేయబోతున్నానో అనేది టీజర్ ద్వారా చెప్పేశారు. 

45
టీజర్ ఎలా ఉందంటే 

ఈ చిత్రంలో రవితేజకి భార్యగా డింపుల్ హయతి నటిస్తోంది. ప్రేయసిగా ఆషిక రంగనాథ్ నటిస్తోంది. పెళ్ళైనప్పటికీ రవితేజ.. ఆషిక అందానికి ఫిదా అయిపోయాడు. తన సమస్యని వివరించేందుకు రవితేజ సైకాలజిస్ట్ దగ్గరకి వెళతారు. అక్కడ ఫన్నీ సీన్స్ చాలా బావున్నాయి. ఒకవైపు భార్య, మరోవైపు ప్రేయసి మధ్య నలిగిపోయే భర్తగా రవితేజ మంచి ఫన్ జనరేట్ చేస్తున్నారు. 

55
సినిమా థీమ్ తెలిసిపోయింది 

సో టీజర్ తోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా థీమ్ ఏంటో చెప్పేశారు. రొటీన్ కి భిన్నంగా రవితేజ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. టీజర్ చూస్తుంటే మాత్రం ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే సినిమా అవుతుందని అనిపిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories