'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రన్ టైం, సెన్సార్ రివ్యూ.. ట్రెండ్ ఫాలోకాని రవితేజ, మినిమమ్ గ్యారెంటీ ఫన్

Published : Jan 11, 2026, 07:40 PM IST

మాస్ మహారాజ్ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం జనవరి 13న రిలీజ్ అవుతోంది. మంచి బజ్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

PREV
15
భర్త మహాశయులకు విజ్ఞప్తి సెన్సార్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రేయ్ అయింది.

25
ట్రెండ్ ఫాలోకాని రవితేజ

ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక వైపు భార్య, మరోవైపు ప్రేయసి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ నటిస్తున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం ఈ చిత్రం ట్రెండ్ ఫాలో కావడం లేదు. ప్రస్తుతం వస్తున్న చిత్రాలన్నీ భారీ రన్ టైంతో వస్తున్నాయి.

35
రన్ టైం ఎంతంటే

కానీ రవితేజ ట్రెండుని పక్కన పెట్టి క్రిస్ప్ రన్ టైంతో వస్తున్నాడు. ఈ చిత్రం ఫైనల్ రన్ టైం కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ప్రేక్షకులని ఎక్కువగా విసిగించకుండా తక్కువ టైంలో కంప్లీట్ గా ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా ఈ చిత్ర యూనిట్ ఉంది.

45
పాజిటివ్ రెస్పాన్స్

సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు టాక్. రవితేజకి ఇద్దరు హీరోయిన్లకు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందట. కిషోర్ తిరుమల దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటారు అని అంటున్నారు.

55
మినిమమ్ గ్యారెంటీ ఫన్

ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే డ్రామా, యువతకి నచ్చే గ్లామర్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉంటూ.. ఇంటర్వెల్ సీన్ ఆసక్తిని పెంచే ట్విస్ట్ తో ఎండ్ అవుతుందట. సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్ ని బాగా వర్కౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రవితేజ ఎట్టకేలకు ఈ చిత్రంతో తన ఫ్లాపులకు అడ్డుకట్ట వేయబోతున్నాడు అని అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories