యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు.. మొదట అతను అసిస్టెంట్ డైరెక్టర్ గానే తన సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత అనుకోకుండా ఊహించని విధంగా రాజ్ తరుణ్ కు ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. బాగా పాపులర్అయ్యాడు కూడా. కాని ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. హీరోగా మంచి కెరీర్ ఉన్న రాజ్ తరుణ్.. కథలు, సినిమాల సెలక్షన్స్ లో రాంగ్ స్టెప్ వేశాడు.