Sobhan Babu
శోభన్ బాబు పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడు. హీరోగా సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగాడు. సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా మార్చాడు. శోభన్ బాబు తోటి నటులకు ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడట. భూమి మీద పెట్టుబడి పెడితే వందల రెట్లు లాభం వస్తుందని చెప్పేవాడట.
Sobhan Babu
శోభన్ బాబు వద్దంటున్నా కొన్ని స్థలాలు అమ్మి వందల కోట్లు నష్టపోయానని నటుడు చంద్ర మోహన్ గతంలో అన్నారు. శోభన్ బాబు మాటలు విని లాభాలు పొందిన నటులు కూడా ఉన్నారు. శోభన్ బాబు డబ్బు విషయంలో అంత నిక్కచ్చిగా ఉండేవారట.
తన కొడుకును సినిమా రంగం వైపు ఆయన తీసుకు రాలేదు. శోభన్ బాబు కుటుంబం గురించి తెలిసింది తక్కువే. ఆయన కుమారుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. చెన్నైలో రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారు. కాగా ఓ స్టార్ డైరెక్టర్ శోభన్ బాబును సగం ఆస్తి అడిగాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఏ కోదండరామిరెడ్డి.
80-90లలో ఏ కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్. ఆయన్ని అందరూ మీరు శోభన్ బాబులా ఉంటారు అనేవారట. శోభన్ బాబుతో కోదండరామిరెడ్డికి అనుభవం ఉంది. వీరి కాంబోలో ప్రేమ మూర్తులు, ఇద్దరూ ఇద్దరే, బావ మరదళ్ళు వంటి చిత్రాలు తెరకెక్కాయి.
Sobhan Babu
ఓ సందర్భంలో ఏ కొండరామిరెడ్డి... అందరూ నన్ను మీలా ఉన్నాను అంటున్నారు. కాబట్టి మీ ఆస్తిలో సగం నాకు ఇవ్వండి, అన్నాడట. అందుకు శోభన్ బాబు... తీసుకోరా, కాకపోతే నా ఆస్తులన్నీ పిల్లల పేరిట రాసేశాను. నా కంటూ ఎలాంటి ఆస్తి లేదు అన్నాడట. ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు.
ఈ సంఘటన శోభన్ బాబుకు ఎంత ఆస్తి ఉందో చెప్పడానికి నిదర్శనం. తనకంటే పెద్ద స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వద్ద లేని సంపద, ఆస్తి శోభన్ బాబు సొంతం. అందుకు ఆయన ఆర్థిక క్రమశిక్షణ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కారణం అయ్యాయి.