రేర్ ఫోటో..21 ఏళ్ళ క్రితం మహేష్, ప్రభాస్ తో ఫుల్ జోష్ లో చిరంజీవి..దీని వెనుక కథేంటో తెలుసా

Published : Oct 16, 2025, 05:17 PM IST

చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఫుల్ జోష్ లో కనిపిస్తున్న 21 ఏళ్ళ క్రితం రేర్ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఏ సందర్భంలోనిది, దాని వెనుక ఉన్న కథేంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
21 ఏళ్ళు పూర్తి చేసుకున్న శంకర్ దాదా ఎంబీబీఎస్ 

మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మరికొందరు హీరోలతో కలిసి ఫుల్ జోష్ లో కనిపిస్తున్న రేర్ ఫోటో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం విడుదలై అక్టోబర్ 15కి 21 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాల గురించి అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 

25
రీమేక్ గా తెరకెక్కిన శంకర్ దాదా ఎంబీబీఎస్ 

జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ లో సక్సెస్ అయిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రనికి ఇది రీమేక్. ఈ మూవీలో చిరంజీవి పక్కన ఏటీఎం అనే పాత్రలో శ్రీకాంత్ నటించారు. సోనాలి బింద్రే హీరోయిన్. పరేష్ రావల్ కీలక పాత్రలో నటించారు. చిరంజీవి తర్వాత ఈ మూవీలో శ్రీకాంత్, పరేష్ రావల్ పాత్రలు హైలైట్ గా నిలిచాయి. 

35
చిరు కామెడీ నెవర్ బిఫోర్ 

ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది. రోగాన్ని కేవలం మందులతో మాత్రమే కాదు.. ప్రేమతో, మనసుతో కూడా నయం చేయొచ్చు అనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. 

45
సోనాలి బింద్రేతో కెమిస్ట్రీ అదుర్స్ 

సోనాలి బింద్రే, చిరంజీవి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ మూవీ విజయం సాధించిన తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. 

55
రేర్ ఫోటో వైరల్ 

శంకర్ దాదా ఎంబీబీఎస్ సక్సెస్ పార్టీకి హాజరైన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. వీరితో పాటు తరుణ్, సుమంత్ కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాలుపంచుకున్నారు. వైరల్ అవుతున్న ఈ రేర్ ఫోటోలో చిరంజీవితో జయంత్ సి పరాన్జీ, శ్రీకాంత్, మహేష్, తరుణ్, సుమంత్, ప్రభాస్ లని చూడొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories