ఆ సినిమాలు ఎందుకు ఆడాయో నాకు తెలియదు, నటించా అంతే: మహేష్ బాబు

First Published | Sep 24, 2024, 8:48 AM IST

బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ తనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్ లో ఇప్పటిదాకా   పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఘనత మహేష్ సొంతం . సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.

. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ తనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన గురించిన విశేషాలు ఎప్పుడూ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. 


  మహేష్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. వైవిధ్యమైన కథలతో.. డిఫరెంట్ పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించాడు. బాలనటుడిగా అనేక చిత్రాల్లో అలరించిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు.

డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన రాజకుమారుడు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మహేష్. అయితే ఆ సినిమాకు ముందు బాల నటుడుగా మహేష్ చాలా సినిమాలు చేసారు.  



దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడలో తొలిసారి మహేష్ బాబు నటించారు. అప్పుడు అతని వయసు నాలుగేళ్లు. హీరోగా ఎప్పుడూ చొక్కా విప్పని సూపర్ స్టార్ తొలి చిత్రంలో చొక్కా లేకుండా నటించడం విశేషం.

కొన్నేళ్లు గ్యాప్ తర్వాత మహేష్ తండ్రి కృష్ణ సినిమా “పోరాటం”లో నటించారు.  తండ్రి, కొడుకులు అన్నదమ్ములుగా నటించి మెప్పించారు. సూపర్ స్టార్ తెరకెక్కించిన సినిమాల్లో శంఖారావం ఒకటి. 1987 లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, మహేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు.  
 


కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బజారు రౌడీ లో కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా నటించారు. ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో మహేష్ నటించి నవ్వులు పూయించారు.కృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు తో కలిసి చేసిన సినిమా ముగ్గురు కొడుకులు.

ఇందులో ముగ్గురూ పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు.కృష్ణ గూడాచారి 116 గా సూపర్ హిట్ అందుకున్నారు. కొన్నేళ్ల తర్వాత గూడాచారి 117 సినిమా చేశారు. ఇందులో మహేష్ నటనతో పాటు డ్యాన్స్ తో అదరగొట్టారు.
 

చిన్నప్పుడే మహేష్ డ్యూయల్ రోల్ చేసి అలరించిన సినిమా కొడుకులు దిద్దిన కాపురం. కృష్ణ, విజయ శాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ కొడుకులుగా అద్భుతంగా నటించారు. ఆ చిన్న వయస్సులోనే  బాల చంద్రుడు సినిమాలో మహేష్ ఫుల్ లెన్త్ రోల్ చేసి ఇక హీరోగా ఎంట్రీ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. మహేష్ బాబు బాలనటుడిగా చివరిగా చేసిన చిత్రం అన్న – తమ్ముడు. ఇందులో అన్నగా కృష్ణ నటించగా తమ్ముడి పాత్రను మహేష్ బాబు పోషించారు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
 

అన్న – తమ్ముడు సినిమాలో మహేష్ బాల నటుడుగా చివరిసారిగా కనిపించాడు. ఆ తర్వాత చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. మహేష్ మొదటి సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

ఈ మూవీ ముహూర్త సన్నివేశానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాప్ కొట్టారు. ఈ సినిమాతోనే మహేష్ బాబుకు ప్రిన్స్ అనే ట్యాగ్ ఇచ్చారు.ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మహేష్ ఓ ఇంటర్వూలో మాట్లాడారు. 
 


మహేష్ మాట్లాడుతూ... అసలు స్టార్ కావాలని ఎప్పుడు అనిపించింది అంటే అది నాన్నగారే డిసైడ్ చేసారు. చిన్నప్పుడు హాలీడేస్ అప్పుడు సినిమాలు చేయించేవారు ఆయన. ఏప్రియల్, మే నెలలో ఓ సినిమా చేసేవాళ్లం. అలా ఆరేడేళ్లు వరసగా సినిమాలు శెలవుల్లో చేస్తూ వచ్చాను. అవి బాగానే ఆడాయి అప్పుడు. అంటే వాటితో నాకు అసలు సంభందం లేదు. ఎందుకు ఆడాయో..నాకు అసలు తెలియదు.

యాక్ట్ చేయమంటే చేసాను. అలా చేస్తూంటే ఒక్క సినిమా మాత్రం జూన్, జూలై కు వెళ్లింది షూటింగ్ . దాంతో స్కూల్లో ఒక ఏడాది పోయింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే..సరే ఇంక సినిమాలు వద్దు వెళ్లి చదువుకో. చదువు అంతా అయ్యిపోయినాక వచ్చి సినిమాల్లో చేద్దువుకానీ. సరే నాన్నా అన్నాను అలాగే అయ్యింది అంటూ తన హీరో ఎంట్రీ జరగటానికు ముందు రోజులు చెప్పుకొచ్చారు ఓ ఇంటర్వూలో మహేష్ బాబు.

ఇదిలా ఉంటే   మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాపై ప్రతీ అప్డేట్‌ టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, సినిమాలో తన లుక్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు రాజమౌళి. ఐతే గతంలో బాహుబలి, ట్రిపుల్‌ ఆర్‌ వంటి పిరియాడికల్‌ డ్రామాలు అందించిన రాజమౌళి… మహేశ్‌బాబు కోసం అటువంటి కథనే రెడీ చేసినట్లు  బయటపడింది.  

హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమా కథ గురించి ఓ సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని టాలీవుడ్‌ టాక్‌. 

Latest Videos

click me!