నేను ఎఫైర్లు పెట్టుకున్న సంగతి నా పిల్లలకు తెలిస్తే..అందుకే అలా చేస్తా, రవీనా టాండన్ హాట్ కామెంట్స్ 

Published : Oct 01, 2023, 04:44 PM IST

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు.

PREV
16
నేను ఎఫైర్లు పెట్టుకున్న సంగతి నా పిల్లలకు తెలిస్తే..అందుకే అలా చేస్తా, రవీనా టాండన్ హాట్ కామెంట్స్ 

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు. ప్రస్తుతం రవీనా వయసు 47 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆమె చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతున్నారు. 

26

కేజీఎఫ్ 2లో రవీనాటాండన్ ప్రధాన మంత్రి పాత్రలో నటించి మెప్పించింది. చాలా రోజుల తర్వాత రవీనా ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేసింది. ఈ చిత్రంలో రవీనా నటనకి ప్రశంసలు దక్కాయి. 90వ దశకంలో రవీనా టాండన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించారు. అయితే చిత్ర పరిశ్రమలో తాను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు రవీనా పలు సందర్భాల్లో తెలిపింది. 

36

ముఖ్యంగా తన ప్రేమ వ్యవహారాల గురించి పత్రికల్లో చాలా అసభ్యంగా రాసేవారు అని రవీనా తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. ఒకప్పుడు రవీనా టాండన్, అక్షయ్ కుమార్ మధ్య ఘాటైన ప్రేమ వ్యవహారం సాగింది. వీళ్ళిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి పీటలు ఎక్కకుండా విడిపోయారు. అప్పట్లో రవీనా ప్రేమ వ్యవహారాలు హాట్  టాపిక్ గా మారేవి. 

46

అయితే 2004లో రవీనా బిజినెస్ మ్యాన్, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే తాజా ఇంటర్వ్యూలో రవీనా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తాను గతంలో నడిపిన ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్ల గురించి తన పిల్లలకు చెప్పేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

56

పోయి పోయి తల్లి తన పిల్లలకు నేను ఇలా ప్రేమ వ్యహారాలు నడిపాను అంటూ అసభ్యంగా చెప్పడం ఏంటి అనే కామెంట్స్ ఎదురవుతున్నాయి. అసలు తన పిల్లలకు తన ఎఫైర్ల గురించి చెప్పడం వెనుక రవీనా లాజిక్ వివరించింది. నేను చెప్పకపోయినా మీడియా, వెబ్ సైట్లు , సోషల్ మీడియా ద్వారా నా పిల్లలు నా గురించి తెలుసుకుంటారు. 

66

కానీ అక్కడ నా గురించి చాలా అసభ్యంగా రాసి ఉంటారు. ఉన్నవి లేనివి కల్పించి రాస్తారు. అలాంటప్పుడు నా పిల్లలు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ముందుగానే నా పిలల్లకి నా జీవితంలో జరిగిన ప్రేమ గురించి నిజాయతీగా వివరిస్తా. అప్పుడు మీడియాలో కనిపించే అవాస్తవాలని వారు నమ్మరు. నన్ను అర్థం చేసుకుంటారు అని రవీనా పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories