సినిమాల్లోకి రాక ముందు మూవీ స్టూడియోలో చీపురు పట్టిన స్టార్ హీరోయిన్.. బడా నిర్మాత కూతురు అయి కూడా ఆ పని

మూడేళ్ల క్రితం `కేజీఎఫ్‌ 2`తో దుమ్ములేపింది బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌. ఇందులో ప్రధాని పాత్రలో టనించి ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఆమె ఇప్పుడు బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. రవీనా టాండన్ తండ్రి రవి టాండన్ ప్రముఖ చిత్రనిర్మాత. అయినప్పటికీ, రవీనా తన తొలి చిత్రం కంటే ముందు చిత్ర సెట్లలో పని మనిషిగా వర్క్ చేసిందట. మరి ఆ కథేంటో చూద్దాం. 

Raveena Tandon before turn as heroine she struggles cleaning movie sets in telugu arj
రవీనా టాండన్

విజయం ఎవరికీ అంత సులువుగా రాదని, కష్టపడితేనే వస్తుందని రవీనా టాండన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె విషయంలో కూడా అదే నిజం. ఆమె ఈజీగా హీరోయిన్‌ కాలేదు. సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా, తను ప్రొడక్షన్‌ లో వర్కర్‌గా పనిచేసింది. సెట్‌లో చిన్న చిన్న ఆఫీస్‌ బాయ్‌ పనులు చేస్తూ మెప్పించింది. 

Raveena Tandon before turn as heroine she struggles cleaning movie sets in telugu arj
రవీనా టాండన్

రవీనా టాండన్ సినీ నేపథ్యం నుండి వచ్చారు, తండ్రి రవి టండన్‌ నిర్మాత అనే విషయం తెలిసిందే. దీంతో రవీనా హీరోయిన్‌ అవుతారని ముందే ఖాయం అయింది. కానీ, దానికోసం ఆమె పూర్తిగా సిద్ధమయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. 


రవీనా టాండన్

తన తండ్రి సినిమాల సెట్లలో చిన్న చిన్న పనులు కూడా చేసేదాన్ని అని రవీనా టాండన్ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ హీరోయిన్‌ కాకముందు తాను చేసిన పనుల గురించి ఓపెన్‌ అయ్యారు. 

రవీనా టాండన్

సినిమా షూటింగ్‌ సెట్‌లో వస్తువులను క్లీన్‌ చేసే పని కూడా చేసిందట. అంతేకాదు హీరో, హీరోయిన్ల దుస్తులను కూడా తీసుకెళ్లేవారట. 

రవీనా టాండన్

నేల తుడిచానని కూడా ఒక ఇంటర్వ్యూలో రవీనా టాండన్ చెప్పారు. ఈ పని తాను చేయడమేంటి అని  ఎప్పుడూ అనుకోలేదట. ఏ పని వచ్చినా చేసేదాన్ని అని చెప్పింది రవీనా టండన్‌. 

రవీనా టాండన్

చివరికి సల్మాన్ ఖాన్‌తో 'పత్థర్ కే ఫూల్' సినిమాతో  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో రవీనా టాండన్‌కు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

రవీనా టాండన్

రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని కూడా నటిగా అరంగేట్రం చేశారు. ఈ ఏడాది 'ఆజాద్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. 

Latest Videos

vuukle one pixel image
click me!