కోట్ల ఆస్తులు పోగొట్టుకుని 50కి, 100కి అడ్డుకునే పరిస్థితికి దిగజారిన హీరోయిన్.. కారణం అతనే

Aithagoni RajuPublished : Apr 18, 2025 6:37 PMUpdated   : Apr 19 2025, 06:32 AM IST

Actress Girija: సినిమా రంగం ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉందడు. హీరోలైనా, హీరోయిన్ లైనా సక్సెస్‌ ఉంటే ఒకలా ఉంటుంది. లేకపోతే మరోలా ఉంటుంది. సినిమాలతో బిజీగా ఉంటే ఆ క్రేజ్‌ వేరు, లేకపోతే ఎవరూ పట్టించుకోరు. చివరికి దీన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. చాలా మంది స్టార్స్ ఇలాంటి పరిస్థితిని ఫేస్‌ చేశారు. ఒకప్పుడు స్టార్స్ గా వెలిగి ఆ తర్వాత అన్నీ కోల్పోయిన రోడ్డున పడే పరిస్థితిని ఫేస్‌ చేశారు. అలాంటి వారిలో నటి గిరిజ ఒకరు.   

15
కోట్ల ఆస్తులు పోగొట్టుకుని 50కి, 100కి అడ్డుకునే పరిస్థితికి దిగజారిన హీరోయిన్.. కారణం అతనే
actress girija

Actress Girija: ఒకప్పుడు కమెడియన్లలో లేడీ కమెడియన్లు కూడా స్టార్స్ గా రాణించారు. ఇప్పుడు అలాంటి వారు తక్కువ కానీ, అప్పట్లో వారికి కూడా హీరోహీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉండేది, అందరు సమానంగా ట్రీట్ చేసేవాళ్లు. అలాంటి లేడీ కమెడియన్లలో గిరిజ ఒకరు.

ఆమె హీరోయిన్‌గానూ మెప్పించారు. ఎన్టీఆర్‌, ఎన్నార్‌, రంగనాథ్‌, చలం, శివాజీ గణేషన్‌, జగ్గయ్య వంటి వారితోనూ సినిమాలు చేసింది. హీరోయిన్‌గా మెప్పించింది. ఆ తర్వాత లేడీ కమెడియన్‌గా పాపులర్‌ అయ్యింది. 

25
actress girija

నటి గిరిజ `పాతాళభైరవి`, `భలే రాముడు`, `ముందడుగు`, `అప్పుచేసి పప్పు కూడు`, `దైవబలం`, `పెళ్లి కానుక`, `భట్టి విక్రమార్క`, `కులదైవం`, `జగదేక వీరుని కథ`, `వెలుగు నీడలు`, `సిరిసంపదలు`, `ఆరాధన`, `పరువు ప్రతిష్ట`, `బందిపోటు`, `రాముడు భీముడు` వంటి వందల చిత్రాల్లో నటించింది.

కంకిపాడుకు చెందిన నటి గిరిజ 1950లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1984 వరకు యాక్టివ్‌గా ఉంది. దాదాపు మూడు దశాబ్దాలపాటు నటిగా మెప్పించింది. 
 

35
actress girija

అప్పట్లో స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా ఆ తర్వాత రేలంగి సరసన కామెడీ పాత్రలు చేసి మెప్పించింది గిరిజ. వీరిద్దరి జోడీ అప్పటి సినిమాల్లో నవ్వులు పూయించేవి. అలా బిజీగా రాణించిన ఆమె ఇప్పటి విలువతో పోల్చితే కోట్లు సంపాదించింది. కోట్ల ఆస్తులు కూడ బెట్టుకుంది.

తరాలు కూర్చొని తిన్నా కరగనంత ఆస్తులు సంపాదించారు. కానీ పెళ్లి అనేది ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. గిరిజ నటుడు సీఎస్‌ రాజు పెళ్లి చేసుకుంది. కానీ అతను తాగుడుకి బానిసయ్యాడు. తాగి వచ్చి గిరిజని చిత్ర హింసలు పెట్టాడు. సినిమాల్లో నటించకుండా చేశాడు. 

45
actress girija

భర్త తాగి వచ్చిన మైకంలో గిరిజని కొట్టడంతో ఒకసారి తల పగిలిపోయి 14కుట్లు కూడా పడ్డాయట. నటిగా ఎంత వైభవంగా వెలిగిందో, ఇంట్లో భర్త విషయంలో అంతగా కష్టాలు పడింది. గిరిజ చేసే దాన ధర్మాలు, భర్త జల్సాలకు ఆమె ఆస్తులన్నీ కరిగిపోయాయట.

ఆస్తులన్నీ అయిపోయాక భర్త ఆమెని వదిలేశాడు. ఒంటరిని చేశాడు. దీంతో అటు సినిమా అవకాశాలు లేక, ఇటు కుటుంబం సరిగ లేక ఆమె చాలా ఇబ్బందులు పడిందట. ఆర్థికంగానూ చితికిపోయింది.

55
actress girija

చివరికి నటి గిరిజ పరిస్థితి ఎలా అయ్యిందంటే 50కి, 100కి ఇతరుల వద్ద చేయి చాచాల్సి వచ్చేదట. పూట గడవడం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, తన వద్దనే చాలా సార్లు డబ్బులు అడుక్కుందని నటి వై విజయ వెల్లడించారు.

అప్పులు కావడంలో పెద్ద బంగ్లాని కూడా వదిలేసి చిన్న అద్దెగడికి షిఫ్ట్ కావాల్సి వచ్చిందట. చివరికి అనాథగా ఒక బస్టాండ్‌లో చనిపోయిందట. ఈ విషయాన్ని నటి వై విజయ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. గిరిజ దయనీయ పరిస్థితిని వెల్లడించారు. 
read  more: `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ రివ్యూ,

also read: ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో ఆస్తులు సంపాదించాల్సిన తెలుగు హీరో.. చివరికి రజనీకాంత్ ఆదుకోవాల్సిన పరిస్థితి

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!