Bigg Boss Telugu 7: తనపై బయటపెట్టాలంటూ ప్రశాంత్‌ని నిలదీసిన రతిక.. శుభ శ్రీ చేసినదానికి హర్ట్ అయిన గౌతంకృష్ణ

First Published | Sep 8, 2023, 11:42 PM IST

శుక్రవారం ఐదో రోజు ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అందులో రైతు బిడ్డని రతిక నిలదీయడం, శుభ శ్రీ విషయంలో గౌతం కృష్ణ అసూయ పడటం,  షకీలా భయపెట్టించడం, చివరికి పవర్‌ అస్త్ర కోసం ఫైటింగ్‌ అనేది ఆసక్తికరంగా నిలిచాయి. 

rathika asked to pallavi prashanth about feeling and gautham felt jealous about shubha sri in bigg boss 7 house arj

బిగ్‌ బాస్‌ తెలుగు 7 మొదటి వారం చివరి దశకు చేరుకుంది. ఓ వైపు లవ్‌ స్టోరీలు, మరోవైపు పవర్‌ అస్త్ర కోసం పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఐదో రోజు ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అందులో రైతు బిడ్డని రతిక నిలదీయడం, శుభ శ్రీ విషయంలో గౌతం కృష్ణ అసూయ పడటం,  షకీలా భయపెట్టించడం, చివరికి పవర్‌ అస్త్ర కోసం ఫైటింగ్‌ అనేది ఆసక్తికరంగా నిలిచాయి. 
 

rathika asked to pallavi prashanth about feeling and gautham felt jealous about shubha sri in bigg boss 7 house arj

శుక్రవారం ప్రారంభంలో.. కంటెస్టెంట్లు కిచెన్‌లో గుడ్లు కొట్టుకోవడం విశేషం. అనంతరం శుభశ్రీ, పల్లవి ప్రశాంత్‌లను బిగ్‌ బాస్‌ గార్డెన్‌ ఏరియాలోకి రమ్మని చెప్పి స్విమ్మింగ్‌ పూల్‌లో దూకమన్నారు. అదే సమయంలో బాత్‌ రూమ్‌లో శివాజీ, రతికలున్నారు. వారికి బిగ్‌ బాస్‌ సీక్రెట్‌ టాస్క్ లు ఇచ్చారు. ఈ టాస్క్ లో వారు సక్సెస్‌ అయ్యారు. దీంతో పవర్‌ అస్త్ర పొందేందుకు, హౌజ్‌లో కన్ఫమ్‌ అయ్యేందుకు పోటీ పడే కంటెండర్‌గా నిలిచారు. ఇలా మొత్తంగా ఈ వారం నలుగురు శివాజీ, రతిక, సందీప్‌, ప్రియాంకలు పవర్‌ అస్త్ర సాధించేందుకు పోటీ పడే కంటెండర్లుగా నిలిచారు. 
 


ఇక ఈ ఎపిసోడ్‌లో మరోసారి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, రతిక లవ్‌ స్టోరీ మరోసారి హైలైట్‌గా నిలిచింది. తనపై ఉన్న ఫీలింగ్‌ ఏంటో చెప్పాలని నిలదీసింది రతిక. అంతకు ముందు ఆమెతో ఎవరు మాట్లాడినా జలసీ ఫీలయ్యాడు పల్లవి ప్రశాంత్‌. ఎవరిని మాట్లాడనిచ్చేవాడు కాదు, టచ్‌ చేయోద్దంటూ హెచ్చరించడం రకరకాలుగా చేశాడు. దీంతో అందరి సమక్షంలో తనపై నీ మనసులో ఉన్న ఫీలింగ్‌ ఏంటో చెప్పాలని నిలదీసింది. కానీ తర్వాత చెబుతాఅని, సందర్భం వచ్చినప్పుడు చెబుతా అని దాటవేస్తూ వెళ్లాడు. దీంతో ఇదంతా డ్రామా అంటూ రతిక కొట్టిపడేసింది. మిగిలిన కంటెస్టెంట్లు కూడా అలాంటి కామెంట్లే చేశారు. 
 

మరోవైపు శుభ శ్రీ విషయంలో గౌతం కృష్ణ జెలసీ ఫీలవుతున్నారు. ఈ ఇద్దరు కలిసి పులిహోర కలుపుకుంటూ హాట్‌ టాపిక్‌ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శుభ శ్రీ విషయంలో గౌతం ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ ఆమె అందరితోనూ ఫ్రీగా మూవ్‌ అవుతుంది. అది చూసి గౌతం తట్టుకోలేకపోతున్నాడు. తాజాగా టేస్టీ తేజతో కలిసి ఆమె డాన్సులేసింది. అది చూసి జెలసీ ఫీలయిన గౌతం ఆమెని అడిగాడు. తనకేం ప్రాబ్లమ్‌ లేదని ఆమె చెప్పింది. దీంతో నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి వెళ్లిపోయాడు. 
 

మరోవైపు రాత్రి షకీలా అందరికి షాక్‌ ఇచ్చింది. హౌజ్‌లో బోర్ కొడుతుందని శివాజీ చెప్పాడు. షకీలాతో ఏదో చెప్పాడు. దీంతో ఆమె భయపడుతున్నట్టు, కలవరపడుతున్నట్టు యాక్ట్ చేసింది. రాత్రంతా అందరిని భయటపెట్టించింది. దీంతో అంతా కంగారు పడ్డారు. అయితే మార్నింగ్‌ లేచాక అదంతా డ్రామా అని, కావాలని చేసిందని తెలిసి దామిని సీరియస్‌ అయ్యింది. శివాజీ, షకీలా అలా చేయకూడదని, సారీ చెప్పాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు కిచెన్‌లో ప్రియాంకకి, దామినికి మధ్య వాగ్వాదం జరిగింది. 

 అనంతరం పవర్‌ అస్త్ర కోసం పోటీ పడే నలుగురిలో ఇద్దరిని ఎలిమినేట్‌ చేసే ప్రాసెస్‌ స్టార్ట్ చేశారు బిగ్‌బాస్‌. శివాజీ,  ప్రియాంక, రతిక, సందీప్‌లో ఇద్దరు దాన్ని అందుకునేందుకు అర్హులు కారో వారిని ఎంచుకోవాలని కంటెస్టెంట్లకి తెలిపారు. ఇందులో ఎక్కువగా రతిక, శివాజీ లను నామినేట్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు పవర్‌ అస్త్రని సాధించేందు అనర్హులుగా నిలిచి పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే తనని ఎంతో నమ్మిన శుభశ్రీ తనని నామినేట్‌ చేయడం పట్ల రతిక బాగా హర్ట్ అయ్యింది. నమ్మించి మోసం చేసిందంటూ వాపోయింది. ఎంతో నమ్మానని, ఇలా మోసం చేస్తుందని ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది రతిక. అదే సమయంలో రతిక అందరితో కనెక్ట్ కావడం లేదంటూ కంప్లెయింట్స్ వచ్చాయి. ప్రియాంక, సందీప్‌ పవర్‌ అస్త్ర కోసం రేపు పోటీపడతారు. మరి ఎవరు సాధిస్తారో చూడాలి. 

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 7న మొదటి వారం ముగింపుకి చేరుకుంది. నామినేషన్‌లో ఉన్న ఒకరు ఎలిమినేట్‌ అయ్యే టైమ్‌ వచ్చింది. మొదటివారం దామిని, గౌతమ్‌ కృష్ణ, కిరణ్‌ రాథోర్‌, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభ శెట్టి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు నామినేట్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos

vuukle one pixel image
click me!