సీనియర్ హీరో శరత్ కుమార్ ను మూడో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది రాధిక. తమిళంలో ఆమె రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, మోహన్, సత్యరాజ్ వంటి చాలా మంది హీరోలతో నటించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎక్కువ సినిమాలు చేసిన అతి కొద్దిమంతి హీరోయిన్లలో రాధిక ఒకరు. మంచి వాడికి మంచివాడు, మూడు ముఖాలు, ఊర్కావలన్, పోకిరి రాజా, రంగా, నండ్రి మీండు వరుగ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఎక్కువ సినిమాల్లో కలిసి నటించడం వల్ల రజినీకాంత్, రాధిక మధ్య మంచి స్నేహం ఉంది.