Pan India Heroines: రష్మిక, సమంత, పూజా, తమన్నా, కాజల్‌, రకుల్‌.. పాన్‌ ఇండియా లెవల్‌లో రచ్చ

First Published | Nov 17, 2021, 7:13 PM IST

ఇప్పటి వరకు పాన్‌ ఇండియా సినిమాలు విన్నాం, పాన్‌ ఇండియా హీరోలు ట్రెండ్‌ని చూస్తున్నాం. మరి పాన్‌ ఇండియా హీరోయిన్లని చూశారా?. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్లు తెరపైకి వచ్చారు. పాన్‌ ఇండియా లెవల్‌లో దుమ్మురేపుతున్నాయి. 
 

ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోలు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌ వంటి హీరోలు పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అన్ని భాషల్లోనూ పాన్‌ ఇండియా(Pan India) సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కథానాయికలు కూడా పాన్‌ ఇండియా హీరోయిన్లు(Pan India Heroines)గా రాణిస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లు రష్మిక మందన్నా, సమంత, పూజా హెగ్డే, తమన్నా, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కీర్తిసురేష్‌ పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తున్నారు. వీరితోపాటు బాలీవుడ్‌ బ్యూటీలు అలియా భట్‌, కృతి సనన్‌, కియారా అద్వానీ పాన్‌ సైతం పాన్‌ ఇండియా చిత్రాలకు నడుం బిగించారు. 
 

నిజానికి పాన్‌ ఇండియా అనే ట్రెండ్‌కి కారణం హీరోయిన్లే అని చెప్పొచ్చు. వారే పాన్‌ ఇండియా ట్రెండ్‌ని సృష్టించారని చెప్పొచ్చు. జనరల్‌గా ఏ హీరో అయినా కేవలం ఆయా భాషలకే పరిమితం కానీ, హీరోయిన్లు మాత్రం ఏకకాలంలో మల్టీఫుల్‌ లాంగ్వేజెల్‌లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇది ఆనాటి నుంచి ఉంది. సావిత్రి, జమున, శ్రీదేవి, హేమా మాలిని, టబు వంటి చాలా మంది హీరోయిన్లు ఇలా మల్టీఫుల్‌గా లాంగ్వేజెస్‌ లో సినిమాలు చేశారు. గతం కంటే ఇప్పుడు ట్రెండ్‌ వేరే. ఒకేసమయంలో రెండు మూడు భాషల్లో నటించడంతోపాటు, పాన్‌ ఇండియా సినిమాల్లోనూ భాగమవుతున్నారు. Pan India Heroines ట్రెండ్‌కి తెరలేపుతున్నారు. దానికి సరికొత్త అర్థాన్నిస్తున్నారు. అన్ని భాషల్లో దూసుకుపోతున్నారు. 
 


ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న వారిలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఒకరు. శాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ నేషనల్‌ క్రష్‌ బ్యూటీ మూడేళ్లలోనే బాలీవుడ్‌ వరకు వెళ్లింది. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తుంది. ఇది పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతుంది. మరోవైపు బాలీవుడ్‌లో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇలా పాన్‌ ఇండియా అనిపించుకుంటుంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. 

సమంత(Samantha).. ఇటీవల నాగచైతన్యతో విడాకులు ప్రకటించిన రెట్టింపు జోష్‌తో కెరీర్‌లో బిజీగా కాబోతుంది. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తుంది సమంత. ఇప్పటికే ఆమె తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్ గా రాణిస్తుంది. తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌తో తను కూడా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు బాలీవుడ్‌లో ఇప్పుడు సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. అదే సమయంలో ఓ మల్టీ లింగ్వల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటించేందుకు రెడీ అవుతుందట సమంత. దీనికి తోడు పాన్‌ ఇండియా మూవీ `పుష్ప`లో స్పెషల్‌ సాంగ్‌ చేస్తుంది సమంత. 
 

Pooja Hegde

పూజా హెగ్డే(Pooja Hegde).. పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు పూజా ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ అన్ని భాషల్లోనూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుండటం విశేషం. మున్ముందు మరిన్ని పాన్‌ ఇండియా చిత్రాల్లో భాగం కాబోతుంది. వాటిలో `భీస్ట్ ` చిత్రంతోపాటు పవన్‌-హరీష్‌ శంకర్‌ చిత్రం, బన్నీతో ఓ సినిమాలోనూ నటిస్తుంది. బాలీవుడ్‌లో ఇప్పటికే `మోహెంజోదారో`, `హౌజ్‌ఫుల్‌4` చిత్రాల్లో నటించగా, ఇప్పుడు `సర్కస్‌`  అనే మరో సినిమాలో నటిస్తుంది పూజా. 

రకుల్‌ ప్రీత్ సింగ్‌(Rakul Preet Singh).. పాన్‌ ఇండియా హీరోయిన్ల జాబితాలోనూ రకుల్‌ కూడా చేరిందని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తమిళంలో `యువన్‌`, `పుథగన్‌`, `ఎయన్నమో ఏదో`, `దేవ్‌`, `ఎన్‌జీకే` చిత్రాలు చేసింది. `ఇండియన్‌2` అనే పాన్‌ ఇండియా మూవీలోనూ భాగమైంది. ఇది వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్‌లో రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న రకుల్‌ ప్రస్తుతం ఆరు హిందీ సినిమాల్లో నటిస్తుంది. తమిళం, తెలుగు, హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. 

పాన్‌ ఇండియా జాబితాలో కాజల్‌(Kajal) కూడా చేరుతుందని చెప్పొచ్చు. బాలీవుడ్‌లో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేసే కాజల్‌ తమిళంలో, తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `ఆచార్య`, `ఘోస్ట్` సినిమాలు చేస్తుంది. బాలీవుడ్‌ సినిమాతోనే కెరీర్‌ ప్రారంభించిన కాజల్‌ తెలుగు, తమిళంలో బిజీగా సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపుతో దూసుకుపోతుంది. అదే సమయంలో బాలీవుడ్‌లోనూ మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ తాను పాన్‌ ఇండియా హీరోయిన్‌నే అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు హిందీలో `ఉమా` చిత్రంలో నటిస్తుంది‌. వెబ్‌ సిరీస్‌లోనూ పాన్‌ ఇండియా నటి అనే ముద్రని వేసుకుంటుంది. 

తమన్నా(Tamannah) సైతం ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న తమన్నా.. హిందీలోనూ సినిమాలు చేస్తుంది. అక్కడ `హిమ్మత్‌వాలా`, `హమ్‌షకలా`, `ఎంటర్‌టైన్‌మెంట్‌`, `ఖామోషీ` చిత్రాల్లో నటించి అక్కడ కూడా తన పాగా వేసుకుంది. ప్రస్తుతం `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ`, `బోల్‌ చుడియన్‌` చిత్రాలు చేస్తుంది. తెలుగులో `ఎఫ్‌3`, `గుర్తుందా శీతాకాలం` సినిమాల్లో నటిస్తుంది. వీటితోపాటు ఇండియన్‌ షో `మాస్టర్ చెఫ్‌ తెలుగు`కి హోస్ట్ గా చేసింది. అంతేకాదు `11వ హవర్‌`, `నవంబర్‌ స్టోరీ` వెబ్‌ సిరీస్‌లతో తెలుగు, తమిళం, హిందీ ఆడియెన్స్ ని అలరించింది తమన్నా. 

కీర్తిసురేష్‌(Keerthy Suresh).. `మహానటి`గా ఇప్పటికే పాన్‌ ఇండియా రేంజ్‌ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది కీర్తిసురేష్‌. మరోవైపు మలయాళంలో మరో పాన్‌ ఇండియా మూవీ `మరక్కర్‌`లో నటిస్తుంది. దీంతోపాటు తెలుగులో మహేష్‌తో `సర్కారు వారి పాట`లో నటిస్తుంది కీర్తి. మరోవైపు చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రంతో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది కీర్తి. ఇటీవల రజనీకి చెల్లిగా `అన్నాత్తే`లో మెరిసిన విషయం తెలిసిందే. ఇది పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదలై ఆకట్టుకుంది. 
 

శృతి హాసన్‌(Shruti Haasan).. పాన్ ఇండియన్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్‌తో పాన్‌ ఇండియా సినిమా `సలార్‌`లో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే తెలుగు, హిందీలో భారీ చిత్రాల్లు చేస్తూ బిజీగా ఉంది శృతి. 
 

మరోవైపు బాలీవుడ్‌ బ్యూటీలు అలియా భట్‌(Alia Bhatt) పాన్ ఇండియా చిత్రాల్లో భాగమవుతుంది. ఆమె తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తుంది. మరోవైపు హిందీలో `గంగూబాయి కథియవాడి`, `బ్రహ్మాస్త్ర`లో నటిస్తుంది. ఇవి కూడా పాన్‌ ఇండియా సినిమాలే కావడం విశేషం. దీంతోపాటు ఆమె సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా రేంజ్‌ హీరోయిన్‌గా నిరూపించుకుంటోంది. 

కియారా అద్వానీ సైతం పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోతుంది. తెలుగు, హిందీలో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రం `ఆర్‌సీ15`లో హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. హిందీ, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో కియారా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

కృతి సనన్‌(Kriti Sanon) సైతం పాన్ ఇండియా హీరోయిన్‌ అనిపించుకుంటుంది. ఇప్పటికే తెలుగు సినిమాల్లో మెరిసిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో నటిస్తుంది. ఇది పాన్‌ ఇండియన్‌ చిత్రంగా రూపొందుతుంది. 
 

వీరితోపాటు సాయిపల్లవి, రాశీఖన్నా, కృతి శెట్టి, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, నిత్యా మీనన్‌, ఐశ్వర్యా రాజేష్‌, అను ఇమ్మాన్యుయెల్‌, అనుపమా పరమేశ్వరన్‌, ప్రియమణి వంటి కథానాయికలు సైతం మల్టీఫుల్‌ లాంగ్వేజెస్‌లో సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా కథానాయికలు అనిపించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు డిజిటల్‌లోనూ సత్తా చాటుతూ మెప్పిస్తున్నారు.

also read: పూర్ణ ఏంజెల్‌ లుక్‌ చూశారా?.. రాజహంసలా `ఢీ` భామ సోయగాలు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
 

Latest Videos

click me!