పూర్ణ ఏంజెల్‌ లుక్‌ చూశారా?.. రాజహంసలా `ఢీ` భామ సోయగాలు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!

First Published | Nov 17, 2021, 4:56 PM IST

`ఢీ` భామ పూర్ణ గ్లామర్‌ సైడ్‌ అనేక కోణాలను చూపించింది. అలాగే వింటేజ్‌ లుక్‌లోనూ మెరిసింది. పొట్టి దుస్తుల్లోనూ హాట్‌ షో చేసింది. ఇప్పుడు నెటిజన్లకి సరికొత్తగా పరిచయమైంది. ఏంజెల్‌ లా కనువిందు చేస్తుంది. 

హాట్‌ అందాల హీరోయిన్‌ పూర్ణకి పెద్ద తెరకంటే, బుల్లితెరమీదే ఫాలోయింగ్‌ ఎక్కువ. `ఢీ` షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్న సమయంలో నుంచి ఈ విషయం స్పష్టమైంది. ఇంకా చెప్పాలంటే `ఢీ` షోతోనే బుల్లితెర ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఈ ఫాలోయింగే ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ని పెంచుతుంది. పూర్ణ తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లని, షోస్‌ అప్‌డేట్‌ లను పంచుకుంటుంది. వారితో సమయం కుదిరినిప్పుడు చాట్‌ కూడా చేస్తుంది. దీనికితోడు గ్లామర్‌ పూత పూస్తుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ సంపూర్ణమైన విందు భోజనం పెడుతుంది పూర్ణ.  poorna glamour photos 

`ఢీ` అందాల భామగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ సుందరి లేటెస్ట్ సరికొత్త ఫోటోలను పంచుకుంది. ఇందులో ఏంజెల్‌ లాగా మురిసిపోతుంది పూర్ణ. అందాల రాజహంసలా స్టెప్స్ పై నుంచి వస్తూ దిగిన పూర్ణ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. వీటిలో పూర్ణ ఇచ్చిన పోజులు సైతం హంటింగ్‌ చేస్తున్నాయి.  poorna glamour photos 


దీంతో ఇప్పుడు పూర్ణ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆయా పిక్స్ ని అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేయడం విశేషం. ఈ సందర్బంగా పూర్ణ పంచుకున్న కొటేషన్‌ మరింతగా ఆకట్టుకుంటుంది. `అందం కంటే మహిళలలో గ్రేస్‌ ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంద`ని పేర్కొంది. poorna glamour photos 

దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా మహిళా నెటిజన్లని మరింతగా ఆకట్టుకుంటున్నాయి. పూర్ణ అందం గురించి ఇంత బాగా చెప్పడం పట్ల వాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళల గురించి ఆమె చెప్పిన కొటేషన్‌ బాగుందని అభినందిస్తున్నారు. poorna glamour photos 

పూర్ణ `ఢీ` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విసయం తెలిసిందే. గణేష్‌ మాస్టర్‌, ప్రియమణిలతోపాటు ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తూ షోకి మరింత గ్లామర్‌ని తీసుకొస్తుంది. షోకి హైప్‌ రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధ్య మధ్యలో ఆమె చెప్పే క్యూట్‌ డైలాగ్‌లు, క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి.  poorna glamour photos 

మరోవైపు నటిగానూ వరుసగా సినిమాల్లో బిజీగా ఉంది పూర్ణ. ప్రస్తుతం ఆమె `అఖండ`, `దృశ్యం 2`తోపాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ఇటీవల `3రోజెస్‌` వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. ఇందులో బోల్డ్ రోల్‌లో ఆడియెన్స్ ని కట్టిపడేసింది.  poorna glamour photos.

also read: jabardasth Rashmi: రష్మీని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. రెబల్‌ పోజులో కాకరేపుతున్న `జబర్దస్త్` రష్మి

Latest Videos

click me!