రష్మిక ఇలా ఇరుక్కుపోయిందేంటి, అండర్ వేర్ హాట్ టాపిక్ అయ్యిపోయింది

Surya Prakash   | Asianet News
Published : Oct 01, 2021, 08:00 AM IST

కన్నడ పరిశ్రమ నుంచి ‘ఛలో..’ అంటూ టాలీవుడ్‌కు వచ్చి.. ‘గీతగోవిందం’తో గిలిగింతలు పెట్టి.. ‘దేవదాస్‌’లా మారకండని చెప్పి ప్రశ్నించే వాడే ‘డియర్‌ కామ్రేడ్‌’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకుంటూ ‘భీష్మ’తో వచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంది.  

PREV
116
రష్మిక ఇలా ఇరుక్కుపోయిందేంటి, అండర్ వేర్ హాట్ టాపిక్ అయ్యిపోయింది


చేసినవి కొద్ది సినిమాలే అయినా తన హావభావాలు, మేనరిజం, డైలాగులతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అభిమానపు గూడు కట్టుకుంది ఈ కన్నడ భామ.  ‘నెవ్వర్‌ బిఫోర్‌.. ఎవ్వర్‌ ఆఫ్టర్‌’ అంటూ సినీహీరో మహేష్‌బాబు పక్కన దుమ్ము రేపిన ఈమె ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో వరస యాడ్స్ చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ యాడ్ వివాదంలో తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అవుతోంది. 

216


బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ఓ అండర్ వేర్ యాడ్ చేసింది రష్మిక. ఈ యాడ్ చూసిన జనాలు మాత్రం కాస్త షాక్ అయ్యేలా ఉంది.  అండర్ వేర్ యాడ్లు అలానే వుంటాయి. కానీ ఇక్కడ రష్మిక వుండటం ఆమె ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి యాడ్ ఎందుకు ఒప్పుకున్నావంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

316


 ఒక అమ్మాయి అబ్బాయి వేసుకున్న ఇన్నర్ వేర్ వైపు ఆబగా చూసినట్లు, అండర్ వేర్ అందానికే ఫ్లాట్ అయిపోయినట్లు, అసలు చూపుతిప్పుకోలేనంత ఎట్రాక్టివ్ గా ఆ చోటు వున్నట్టుగా యాడ్ లో
చూపించారు. ఈ క్రియేటివిటి చూసిన వారికి మైండ్ పోతోంది.

416


 ఇలాంటి కాన్సెప్ట్ లో రష్మిక కనిపించడం ఆమె అభిమానులకు మింగుడు పడటం లేదు. ఇలాంటి యాడ్లు చేసేముందు ఆలోచించుకోవద్దా.. దయచేసి ఇలాంటి యాడ్లు మళ్ళీ చేయద్దని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు. 

516


ఇదిలా ఉంటే  ఫెమినిస్టుల నుంచి రష్మికకి గట్టి విమర్శలు ఎదురౌతున్నాయి. ఒక అమ్మాయి అబ్బాయి అండర్ వేర్ వంక అంత ఆబగా చూస్తుందా ? నిజ జీవితంలో ఒక అమ్మాయి, అబ్బాయి అండర్ వేర్ చూసి మైకంలో మునుగుతుందా? ఇలాంటి ప్రకటనల ద్వారా అమ్మాయిలని ఎలా చిత్రీకరించాలని భావిస్తున్నారు ? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

616


రష్మిక వ్యక్తిగత విషయాలకు వస్తే.. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విజయ్‌పేట్‌లో జన్మించిన రషి్మక విద్యాభ్యాసమంతా కర్ణాటకలోనే సాగింది. కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివిన ఆమె ఎంఎస్‌ రామయ్య కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్, సైన్స్‌ అండ్‌ కామర్స్‌ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసింది. పద్దెనిమిదేళ్లకే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. 

716


 రష్మిక మాట్లాడుతూ...నాది చాలా సాధారణమైన జీవితం. షాపింగ్‌కు ఎక్కువగా డబ్బులు ఖర్చుపెట్టను. నాకు ఎప్పుడైనా కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి షాపింగ్‌ చేస్తాను. ఇక దుస్తుల విషయంలోనూ సంప్రదాయ దుస్తులను ఎక్కువగా ఇష్టపడుతాను. ఖాళీ లభిస్తే టీవీ, పుస్తకాలతోనే ఎక్కువ సమయం గడుపుతాను. యానిమేటెడ్‌ కార్టూన్,  చైతన్యపరిచే పుస్తకాలను ఎక్కువగా చదువుతాను అని చెప్పుకొచ్చింది.

816


అలాగే నన్నందరూ తెలుగమ్మాయి అనుకుంటున్నారు. నేను కూడా అచ్చు తెలుగు అమ్మాయిలాగానే ఉండటమే కాదు బాగా మాట్లాడుతున్నాను కూడా. మొన్నటి సినిమాలో డబ్బింగ్‌ కూడా నేనే చెప్పుకున్నాను. తెలుగు మాట్లాడుతుంటే కన్నడ మాట్లాడినట్లుగానే ఉంటున్నది అంది.  

916

సినిమాల్లో అవకాశం రాకుంటే ఖచి్చతగా ఫిట్‌నెస్, క్రీడలకు సంబంధించి వ్యాపారంలోకి అడుగుపెట్టేదానిని. లేదంటే సైకియాట్రిస్టుగా చేసేదానిని.  సమయం లభిస్తే ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతాను. సినిమాల్లోకి రాకముందు ఎక్కువ సమయం అక్కడే ఉండేదానిని. ఇప్పుడు సమయం తగ్గడంతో రోజు గంటపాటు జిమ్‌కు కేటాయిస్తున్నాను.

1016

ప్రేమ చిహ్నమైన చారి్మనార్‌ గురించి విన్నాను. అయితే అక్కడికి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా కుదరడం లేదు. ఏదో ఒక రోజు అర్ధరాత్రి బురఖా వేసుకొని చూసి వస్తాను. గోల్కొండ కోట కూడా చూడాలని ఉంది.  

1116

ఇంకో రెండు, మూడు సినిమాలు  చేయాల్సి ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉండాలనిపిస్తోంది.  

1216

హైదరాబాద్‌లో లగ్జరీ లైఫ్‌ బాగా పెరిగింది. పబ్‌ కల్చర్‌ బాగా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్‌లోని ఒక రోడ్డు చూశాను. అమెరికా, ఆస్ట్రేలియా నగరాల్లో ఉన్నటువంటి లగ్జరీ కనిపించింది.

1316

కాలేజీలో ఉన్న మయంలో ఫ్రెష్‌ ఫేస్‌ పేరుతో నిర్వహిస్తున్న ఆడిషన్స్‌కు నాకు తెలియకుండానే కాలేజి లెక్చరర్‌ నా పేరు ఇచ్చారు. అలా కాలేజ్‌ కార్యక్రమంలో పాల్గొని మొదటి స్థానంలో నిలిచాను. అక్కడి నుంచి బెంగుళూరులోనే అన్ని కళాశాలలకు చెందిన విజేతలతో నిర్వహించిన పోటీలోనూ ప్రథమస్థానం దక్కించుకొన్నాను. 

1416
Rashmika

‘ఛలో’ తర్వాత వెంకీ కుడుముల నెక్ట్స్‌ సినిమాలో నటిస్తాను అని అప్పుడే చెప్పాను. మాటిస్తే నిలబెట్టుకోవాలనుకునే మనస్తత్వం నాది. కొన్నిసార్లు డేట్స్‌ ఇబ్బంది అయినా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. వరుసగా సినిమాలు చేయడం వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. అలా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించే అవకాశం మిస్‌ అయింది. నాతో సినిమాలు చేసిన దర్శకులు మళ్లీ నన్ను హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకోవడం చాలా సంతోషంగా ఉంది.

1516

నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అంటే.. జిమ్‌ చేస్తుంటాను. వెయిట్‌ లిఫ్టింగ్స్‌ చేస్తుంటా. స్పోర్ట్స్‌ ఆడతాను. డైట్‌ మెయింటేన్‌ చేస్తుంటాను. షుగర్‌ ఉన్న పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేశాను. చాక్లెట్స్‌ వైపే చూడటం లేదు.

1616

పబ్లిక్‌లో కనిపించేవాళ్లు విమర్శలు ఎదుర్కోవడం  కామన్‌. మన గురించి ఎప్పుడూ  మంచే మాట్లాడాలని అనుకోలేం. అది కుదరదు కూడా. నా కెరీర్‌ తొలి రోజుల్లో చాలా సీరియస్‌గా తీసుకునేదాన్ని. ఇప్పుడు విమర్శలను పట్టించుకోవడం లేదు.

click me!

Recommended Stories