మరో క్రేజీ సీక్వెల్ కమిటైన రష్మిక

First Published | Dec 19, 2024, 6:35 AM IST

పుష్ప 2 సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మంధానకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. కాక్ టెయిల్ 2 సినిమాతో పాటు మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులకు సైన్ చేసింది.

Rashmika Mandanna, pushpa 2, cocktail

అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 మూవీ గత పదిహేను  రోజులుగా  బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ గత రికార్డులను చెరిపేస్తూ. . అందర్నీ ఆశ్చర్యపరిచేలా వసూళ్లను రాబడుతోంది.  పుష్ప 2లో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిగా నటించగా రష్మిక మంధాన కు ఈ సినిమాతో మరో సారి పేరు మారు మేగిపోయింది.

 దాదాపు ఐదేళ్లు పుష్ప టీమ్‌తో జర్నీ చేసిన రష్మిక.. పుష్ప 1తోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప 2లో అందం, అభినయంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప 2  లో చేసిన రష్మిక మంధాన.. ఈ సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఇప్పుడు పెద్ద బ్యానర్స్ అన్నీ ఆమెతో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.


వరల్డ్‌వైడ్‌గా పుష్ప 2 మూవీ 12,500 స్క్రీన్లలో విడుదల అవగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ భాషల్లోనూ మూవీ రిలీజైన విషయం తెలిసిందే. తెలుగు కంటే హిందీలోనే పుష్ప2కి కలెక్షన్లు ఎక్కువగా వస్తుండటం గమనార్హం.

ఈ క్రమంలో హిందీ ప్రొడ్యూసర్స్ దృష్టి పూర్తిగా రష్మిక మీద పడింది. అల్లు అర్జున్ ఎలాగో తమకు దొరకడు. రష్మికని అయినా తమ సినిమాలోకి తీసుకోవాలని ఆశిస్తున్నారు. దాంతో ఓపినింగ్స్ కు కొదవ ఉండదని భావిస్తున్నారు. అయితే రష్మిక ఆచి తూచి మందుకు వెళ్తోంది. 



నాగశౌర్య ఛలో చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక..విజయ దేవరకొండ గీతాగోవిందం సినిమాతో.. చెరిగిపోని ముద్ర వేసుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి విజయం అందించింది.‌ ఇక ఆ సినిమా తర్వాత నుంచి తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా ఈమె కెరియర్ కి ఓ రేంజిలో బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా వల్ల ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది రష్మిక. ఇక ఆ తరువాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా.. బాలీవుడ్లో సైతం ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టింది.  ఇప్పుడు మరో హిందీ సినిమా కమిటైందని సమాచారం.


తాజాగా రష్మిక మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షాహిద్ కపూర్ సరసన ‘కాక్ టెయిల్ 2’ చేయటానికి సైన్ చేసింది. ఈ సినిమా ఓ క్రేజీ సీక్వెల్ గా బాలీవుడ్ అబివర్ణిస్తోంది.  అనే ఈ సీక్వెల్ మూవీలో రష్మికతో పాటు స్త్రీ 2తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన శ్రద్ధా కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. 

Rashmika Mandanna

 రష్మిక  ఫీమేల్ లీడ్ లో నటించిన ఛావా అనే హిందీ మూవీ ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది రష్మిక. చాలా తక్కువ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అంటోంది. శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ కథగా రాబోతోన్న ఈ మూవీలో విక్కీ కౌశల్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ సరసన సికందర్ అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో పాటు థామా అనే హారర్ మూవీలో కూడా నటిస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్స్ తో తను బాలీవుడ్ లో కూడా పూర్తిగా సెటిల్ అయ్యిపోవాలని చూస్తోంది. 


ఇటు తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ ఉన్నాయి.   తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోన్న ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో ఆమే మెయిన్ లీడ్ చేస్తోంది.  గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.

Latest Videos

click me!