Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్

Published : Mar 12, 2026, 08:06 PM IST

రష్మిక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. పెళ్లి సంతోషం మధ్యలో ఇలాంటి వివాదాలు రావడం నటితో పాటు ఆమె కుటుంబానికి కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. 

PREV
18
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సంబరాలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సంబరాలు ఇంకా ముగియలేదు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ స్టార్ జంట చాలా ప్రైవేట్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రష్మిక తల్లి ప్రైవేట్ ఆడియో లీక్ అవ్వడంపై ఆమె తీవ్రంగా స్పందించారు.

28
ప్రైవేట్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్
పెళ్లి ఆనందంలో తేలియాడుతున్న ఈ కన్నడ బ్యూటీకి ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. ఆమె తల్లికి సంబంధించిన పాత ప్రైవేట్ సంభాషణ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఆకతాయిలు దీన్ని వైరల్ చేయడంతో, ఈ విషయంపై రష్మిక తొలిసారిగా మౌనం వీడారు.
38
రష్మిక తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్
అసలేంటి ఈ వివాదం? పెళ్లయిన కొద్ది రోజులకే రష్మిక తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఆడియోలో ఆమె, రష్మికకు నటుడు రక్షిత్ శెట్టితో బ్రేకప్ అయిన ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడారని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
48
ఎనిమిదేళ్లుగా నాపై కావాలనే దుష్ప్రచారం
ఈ పరిణామంతో తీవ్రంగా నొచ్చుకున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. "మనుషులు ఇంత నీచంగా ఎలా దిగజారగలరు? గత ఎనిమిదేళ్లుగా నాపై కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం, వేధింపులు, దాడులు చేస్తున్నారు" అని ఆమె ప్రశ్నించారు.
58
నేను చెప్పని మాటలను వక్రీకరిస్తున్నారు
"నేను చెప్పని మాటలను వక్రీకరిస్తున్నారు. కేవలం వ్యూస్, రీచ్ కోసం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు అన్ని హద్దులు దాటేశారు" అని రష్మిక తన పోస్టులో మండిపడ్డారు.
68
అనుమతి లేకుండా దాన్ని రికార్డ్ చేశారు
వైరల్ అవుతున్న ఆడియోపై రష్మిక స్పష్టత ఇచ్చారు. "అది దాదాపు ఎనిమిదేళ్ల నాటి ప్రైవేట్ సంభాషణ. సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా దాన్ని రికార్డ్ చేశారు. నా వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన సమయంలో (పెళ్లి టైంలో) కావాలనే దీన్ని లీక్ చేశారు. ఇది నా, నా కుటుంబ ప్రైవసీపై జరిగిన తీవ్రమైన దాడి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
78
ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను

పోస్ట్ చివర్లో రష్మిక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. "ఎవరో తెలియని వాళ్లు వచ్చి మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించలేరు. మనం ఎలా బతకాలో మనమే నిర్ణయించుకోవాలి. నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను" అని రాసుకొచ్చారు.

88
రష్మిక పోస్ట్ వైరల్

ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమెకు సపోర్ట్ గా చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు నిలుస్తున్నారు. పెళ్లి సంతోషం మధ్యలో ఇలాంటి వివాదాలు రావడం నటితో పాటు ఆమె కుటుంబానికి కూడా మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. రష్మిక తదుపరి చర్య ఏంటో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories