Rashmika Mandanna: స్టార్ ప్రొడ్యూసర్ కు షాక్ ఇచ్చిన రష్మిక... జీఎస్టీతో సహా లెక్కలు చెప్పిన శ్రీవల్లి...?

First Published | Feb 27, 2022, 1:38 PM IST

బాలీవుడ్ ను టార్గెట్ చేసుకున్న రష్మిక.. టాలీవుడ్ లో ఆఫర్లకు ఎగనామం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆఫర్లు ఇస్తూ వస్తున్న మేకర్స్ కు షాకులిస్తోందట శ్రీవల్లి.

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రష్మిక మందన్న. వరుస హిట్లు పడేసరికి అమ్మడికాళ్లు ఆకాశంలో తేలుతున్నట్టున్నాయి. టాలీవుడ్ ఆఫర్స్ కు ఆమె నొ చెప్పేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఒక వేళ ఎస్ అన్నా... భారీగా డిమాండ్ చేస్తుందట కన్నడ కస్తూరి.

ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది రష్మిక. ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. ఇక సూపర్ స్టార్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా ఆమెను స్టార్ హీరోయన్ల సరసన నిలబెట్టింది.


ఇక  ఈ మధ్యనే అల్లు అర్జున్ కు జోడీగా నటించిన పుష్ప సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్నా. ఈసినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఓ ఇమేజ్ ను తెచ్చుకున్న కన్నడ భామకు  బాలీవుడ్ ఆశలకు గేట్లు తెరచుకోవడంతో పాటు.. ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తోంది.

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతున్నట్లుంది. అందుకే  పుష్ప సక్సెస్‌ తర్వాత రెమ్యునరేషన్‌ అమాంతం పెంచేసిందట రష్మిక. నిర్మాతల నుంచి భారీగా డిమాండ్‌ చేస్తుందని టాక్‌ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

 రీసెంట్‌గా ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ కోసం గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ సం‍ప్రదించినప్పుడు, రష్మిక జీఎస్టీతో కలిపి 3కోట్లకేపైగానే డిమాండ్ చేసిందట. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్  దర్శకత్వం వహించబోయే సినిమా కోసం రష్మికను సంప్రదించారట టీమ్. రష్మిక డిమాండ్ తో మేకర్స్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

అంతే కాదు రష్మిక తరువాత సినిమాలన్నింటికి 3 కోట్లపైనే డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. పుష్ప పార్ట్ 2 కోసం కూడా రష్మిక ఇంతే డిమాండ్ చేస్తుందట. ఆ మధ్య ఓ పెద్ద హీరో సినిమాను రిజక్ట్ చేసిందన్న పుకార్లు కూడా రష్మిక పైన వచ్చాయి. ఇప్పుడు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనన్న మాటలు వినిపిస్తున్నాయి.

Latest Videos

click me!