రష్మిక మందన్నా.. అందం, అభినయం మాత్రమేకాదు, చలాకీతనం, ఇంటలిజెన్సీ సొంతం. టాలెంట్, అందం ఉన్న అమ్మాయిల స్పీడ్ మామూలుగా ఉండదని చెబుతుంటారు. ఆ రెండు కలగలిపిన రష్మిక ఎలాంటి బ్రేకుల్లేకుండా దూసుకుపోతుంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోవడం, కన్నడ, తమిళం, తెలుగు, హిందీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుండటం విశేషం.