ట్రోలర్స్ కి దొరికిపోయిన జాన్వీ కపూర్‌.. కాలిక్యులేటర్‌ తో ఆల్జీబ్రా అంటూ చిక్కుల్లో అతిలోక సుందరి తనయ

Published : Jul 25, 2022, 06:57 PM ISTUpdated : Jul 25, 2022, 06:59 PM IST

బాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్‌ అందాలతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పోటేత్తే అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టించే ఈ భామ లేటెస్ట్ గా ట్రోలర్స్ కి దొరికిపోయింది.   

PREV
17
ట్రోలర్స్ కి దొరికిపోయిన జాన్వీ కపూర్‌.. కాలిక్యులేటర్‌ తో ఆల్జీబ్రా అంటూ చిక్కుల్లో అతిలోక సుందరి తనయ

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) అనతి కాలంలోనే తనకంటూ సెపరేట్‌ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సినిమా పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, సోషల్‌ మీడియా ద్వారా మాత్రం విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. బోల్డ్ ఫోటో షూట్లతో కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది. నెట్టింట దుమ్ము దుమారం చేస్తుంది. 
 

27

జాన్వీ కపూర్‌ బోల్డ్ ఫోటో షూట్లు నెటిజన్లని కట్టిపడేస్తుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకోవడమే లక్ష్యంగా అందాలు ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ చాలా సందర్భాల్లో ట్రోల్స్ కి గురైంది. ముఖ్యంగా ఆమె ధరించే డ్రెస్‌, పోజులు వివాదంగా మారాయి. తాజాగా మరోసారి ట్రోల్స్(Janhvi Kapoor Trolls) బారిన పడింది. లెక్కలు తప్పి ఈ భామ దారుణంగా ట్రోల్స్ కి గురికావడం గమనార్హం. 

37

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం `గుడ్‌ లక్‌ జెర్రీ` చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.ఓటీటీలో రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలిస్తుంది. మీడియా ముందుకొస్తుంది జాన్వీ. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె లెక్కల(మ్యాథ్స్) ప్రస్తావన తీసుకొచ్చింది. అందులో జాన్వీ చెప్పిన సమాధానం ఇప్పుడు విమర్శలపాలవుతుంది. 

47

స్టడీస్‌ పరంగా తనకు హిస్టరీ, లిటరేచర్‌ ఇష్టమని, మ్యాథ్స్ అంటే అస్సలు నచ్చదని తెలిపింది. మ్యాథ్స్ గురించి చెబుతూ, కాలిక్యులేటర్‌ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా ఈజీ అయ్యింది. కానీ ఇంకా కష్టపడి ఆల్జీబ్రాని నేర్చుకోవడంలో ఉపయోగమేంటో అస్సలు అర్థం కాదు. మ్యాథ్స్ కోసం ఎందుకు అంతలా తలలు బడ్డలు కొట్టుకుంటారో తెలియదు. చరిత్ర, సాహిత్యం ప్రజల్ని సంస్కారవంతమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. మ్యాథ్స్ మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుందని చెప్పింది. 

57

ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసిన ఓ నెటిజన్ల ఈమె ఎవరూ అంటూ ప్రశ్నిస్తూ వీడియోని షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రెచ్చిపోతున్నారు. జాన్వీని ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. `కాలిక్యులేటర్‌తో ఆల్జీబ్రాని చేసేందుకు జాన్వీ ప్రయత్నిస్తుందని, ఇక్కడే లాజిక్‌ చచ్చిపోయిందంటున్నారు. లక్షల ఫీజు కట్టి ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుందనే దానికిదే ఉదాహరణ` అని, మీ దయనీయ స్థితికి మ్యాథ్స్ ని ఎందుకు నిందిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. 

67

మొత్తంగా ఇంటర్నెట్‌లో జాన్వీ కపూర్‌ హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక `గుడ్‌ లక్‌ జెర్రీ` మూవీ ఈ నెల 29న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతోపాటు జాన్వీ `మిలి`, `మిస్టర్‌ అండ్‌ మిస్ట్రెస్‌ మహి`, `బవాల్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

77

జాన్వీ కపూర్‌ సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. చాలా కాలంగా ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలొచ్చాయి. విజయ్‌ దేవరకొండతో కలిసి `లైగర్‌` టైమ్‌లోనే నటించబోతుందన్నారు. కానీ సెట్‌ కాలేదు. ఎన్టీఆర్‌ 30లోనూ ఆమె పేరు వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు సౌత్‌ సినిమా కన్ఫమ్‌ కాలేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories