బెడ్‌పై పడుకుని రష్మిక మందన్నా విరహ వేదన.. ఇలా చూస్తే కుర్రాళ్లకి చెమటలే.. డేటింగ్‌పై కావాలనే హింట్‌ ఇస్తుందా?

First Published | Nov 16, 2023, 7:55 AM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మొన్నటి వరకు బోల్డ్ గా రెచ్చిపోయి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పుడు మరో యాంగిల్‌ చూపిస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు చూస్తే థర్మామీటర్లు పగిలిపోవడం ఖాయం. 

photo credit-rashmika instagram

రష్మిక మందన్నా.. నయా ట్రీట్‌తో ఇప్పుడు ఇంటర్నెట్‌ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. తన ఫాలోవర్స్ అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సింపుల్‌గా ఆమె చేసిన పని కుర్రాళ్లకి బాడీలు హీటెక్కిపోతున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో రష్మిక మందన్నా హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

photo credit-rashmika instagram

మొన్నటి వరకు డీప్‌ ఫేక్‌ వీడియో విషయంలో నేషనల్‌ వైడ్ గా చర్చనీయాంశంగా మారింది రష్మిక. ఆమెకి సపోర్ట్ గా అందరు కదిలారు. తనకు వచ్చిన ఆదరణ, సహకారం పట్ల ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమెకి అందిన సపోర్ట్ కింద ఆ సమస్య చిన్నదైపోయింది. దాన్నుంచి బయటపడింది రష్మిక. కానీ మరో విషయంలో ఆమె వార్తల్లో నిలుస్తుంది. 
 


photo credit-rashmika instagram

ప్రస్తుతం ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. కారణం.. ఆమె బెడ్‌పై పడుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకోవడం. చూడ్డానికి ఇవి టూ హాట్‌గా ఉండటమే. బెడ్‌పై రష్మిక విరహ వేదన చెందుతున్నట్టుగా, కుర్రాళ్లని రెచ్చగొడుతున్నట్టుగా ఉండటమే. 
 

రికవరీ కూడా చాలా ముఖ్యమే అని పేర్కొంటూ ఆమె ఈ ఫోటోలను పంచుకోగా, అవి దుమారం రేపుతున్నాయి. రిలాక్సేషన్‌ మూడ్‌లో ఉన్న రష్మికని చూసి పై తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. హాట్‌గా కామెంట్లతో ఈ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. ఇలా మొత్తంగా శ్రీవల్లి మరోసారి చర్చనీయాంశం అవుతుంది.
 

Rashmika Mandanna

ఇదే కాదు మొన్న దీపావళి సమయంలోనూ ఆమె పంచుకున్న ఫోటో పెద్ద రచ్చ చేసింది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బ్యూటీ శారీ కట్టుకున్న ఫోటోని పంచుకుంది. అయితే ఆమె ఉన్న చోటే చర్చనీయాంశం అయ్యింది. రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే పుకార్లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పిన ఈ జోడి రూమర్లని ఎప్పుడూ ఖండించలేదు. 
 

Vijay Deverakonda, Rashmika Mandanna

దీనికితోడు రెండు మూడు సార్లు ఈ ఇద్దరు ఒకే చోట ఉన్నట్టుగా వారు సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్న ఫోటోలతో తేలిపోయింది. ఇలా అడ్డంగా బుక్కయ్యారు. ఆ మధ్య వెకేషన్‌కి వెళ్లినా అక్కడా ఇద్దరి లొకేషన్‌ సేమ్‌ చూపించింది. మరోవైపు దీపావళి సందర్భంగా పంచుకున్న ఫోటోలు కూడా సేమ్‌ ఉండటం విశేషం. 
 

Image: Instagram

విజయ్‌ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్‌ చేసుకుందని తేలిపోయింది. ఈ ఇద్దరు కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్‌` చిత్రాలు చేశారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని టాక్‌. దీంతో అప్పట్నుంచి అడపాదడపా విజయ్‌ ఇంటికి వస్తుంది రష్మిక. అప్పట్లో డైరెక్ట్ గానే ఫోటోలు పంచుకున్నారు. దీంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఆ తర్వాత ఇన్‌డైరెక్ట్ గా ఆ ఫోటోలను పంచుకుటున్నారు. 
 

అయితే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ ఇద్దరు కావాలనే హింట్‌ ఇస్తున్నారని, రష్మిక అయితే తమ ప్రేమని, తాము డేటింగ్‌లో ఉన్నామనే విషయాన్ని ఈ రూపంలో చెబుతుందని, కావాలనే హింట్‌ ఇస్తుందని తెలుస్తుంది. నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అమ్మడు తరచూ టాప్‌ న్యూస్‌గా నిలుస్తుంది. మరి ఈ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తారా? అనేది చూడాలి. 
 

ప్రస్తుతం రష్మిక `యానిమల్‌` చిత్రంలో నటించింది. డిసెంబర్‌ 1న విడుదల కాబోతుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే `రెయిన్‌బో` అనే మూవీ కూడా చేస్తుంది. మరోవైపు విజయ్‌ దేరవకొండ.. పరశురామ్‌తో `ఫ్యామిలీ మ్యాన్‌` చిత్రం చేస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల తప్పుకోవడంతో రష్మికనే తీసుకుంటున్నారని సమాచారం. 

Latest Videos

click me!