Rashmika Mandanna: తన సక్సెస్ సీక్రెట్ చెప్పిన రష్మిక మందన్నా.. వాళ్లలా చేసి ఉంటే అడ్రస్‌ ఉండేది కాదా?

Published : Jul 25, 2026, 11:10 PM IST

సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులకు, మూస ధోరణులకు నేను అలవాటు పడలేదు. మొదట్లో కాస్త కంగారుపడ్డా. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక పక్కా ప్లాన్‌తో ఉండేవారు. కానీ నేను నా మనసు చెప్పిందే విన్నాను అంటోంది రష్మిక మందన్నా.

PREV
17
క్రోక్స్ మాన్‌ సూన్‌ క్యాంపెయిన్‌లో రష్మిక మందన్నా

సౌత్ ఇండియాలో కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం తనవైపు చూసేలా చేసింది రష్మిక మందన్నా.  'నేషనల్ క్రష్'గా పాపులర్‌ అయ్యింది.  కేవలం నటనతోనే కాదు, తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ రష్మిక ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా 'Crocs' మాన్‌సూన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న రష్మిక, తన సినీ ప్రయాణం, వ్యక్తిగత  పద్ధతుల గురించి మనసు విప్పి మాట్లాడింది. రష్మిక ఏం చెప్పిందో చూద్దాం.

27
పాత పద్ధతులకు దూరంగా రష్మిక మందన్నా

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఒక నిర్దిష్టమైన చట్రం (Mould) ఉంటుంది. కానీ ఆ చట్రంలో ఇరుక్కోకుండా, తన దారిలో తాను వెళ్లడమే తన విజయ రహస్యం అంటోంది ఈ అమ్మడు. `నేను బాలీవుడ్ గానీ, ఇతర భాషల్లోకి కొత్తగా వెళ్లినప్పుడు, అక్కడి పాత పద్ధతులకు, సంప్రదాయాలకు అలవాటు పడటానికి ప్రయత్నించలేదు` అని రష్మిక చెప్పింది.

37
రష్మిక నిర్ణయమే ఆమెని స్పెషల్‌గా మార్చిందా?

`మొదట్లో నాకు కొంచెం కంగారుగా అనిపించింది. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక పక్కా ప్లాన్‌తో పని చేసేవాళ్లు. కానీ నేను మాత్రం నా ఇన్‌స్టింక్ట్స్ (Instincts) నమ్మి ముందుకు వెళ్లాను. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ నిర్ణయమే నా ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చిందనిపిస్తోంది` అని రష్మిక గర్వంగా చెప్పుకొచ్చింది.

47
మనం మనలా ఉన్నప్పుడే విలువ -రష్మిక మందన్నా

ఈ బ్రాండ్ ప్రమోషన్‌లో రష్మిక మాట్లాడుతూ.. "మనం ఇతరులను మెప్పించడానికి వాళ్లలా ఉండాల్సిన అవసరం లేదు. మనం మనలా ఉన్నప్పుడే మనకు విలువ ఉంటుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా నేను చెప్పాలనుకున్నది కూడా అదే. అందరిలా ఉండక్కర్లేదు, మీ వ్యక్తిత్వమే మీ బలం కావాలి" అంటూ అభిమానులకు  ఇన్‌స్పైరింగ్‌ సందేశాన్నిచ్చింది రష్మిక మందన్నా.

57
టీమ్‌ వర్క్ తో బెస్ట్ ఔట్‌పుట్‌
ఈ షూటింగ్ అనుభవం గురించి రష్మిక మాట్లాడింది. సెట్‌లో ఉన్న ఎనర్జీని, టీమ్ వర్క్‌ను ఆమె మెచ్చుకుంది. "అందరూ ఒకే లక్ష్యంతో ఉత్సాహంగా పనిచేసినప్పుడు, అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుంది" అని చెప్పింది. ఇక వర్షాకాలం ఫ్యాషన్ విషయానికొస్తే, రష్మికకు కంఫర్ట్ (Comfort) చాలా ముఖ్యమట.
67
క్రోక్స్ ప్రత్యేకత చెప్పిన రష్మిక

"వర్షాకాలంలో నా గొడుగు, క్రోక్స్ లేకుండా బయటకు అడుగు పెట్టను. క్రోక్స్ కేవలం సౌకర్యంగా ఉండటమే కాదు, మన స్టైల్‌ను కూడా పెంచుతాయి. Jibbitz ఉపయోగించి మనకు నచ్చినట్టు వాటిని డిజైన్ చేసుకోవచ్చు` అంటూ తన ఫ్యాషన్ మంత్రాను పంచుకుంది.

77
విజయ్‌ దేవరకొండతో పెళ్లి తర్వాత రష్మికలో చాలా మార్పు

మొత్తం మీద, వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న, స్టార్‌డమ్ వచ్చినా తన సహజమైన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.  విజయ్‌ దేవరకొండతో మ్యారేజ్‌ తర్వాత రష్మికలో చాలా మార్పు వచ్చింది. చాలా హుందాగా మారింది. మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తుంది. తన యాటిట్యూడ్‌ మాత్రమే కాదు, మాట తీరు కూడా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె విజయ్‌ తో `రణబాలి` చిత్రంలో నటిస్తోంది. ఇది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అలాగే `మైసా` మూవీలో నటిస్తోంది రష్మిక.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories