Nagarjuna: అమ్మాయి పుడుతుందని నాగార్జున సంబరాలు, పేరు కూడా ఫిక్స్.. కానీ బెడ్‌పై అబ్బాయిని చూసి షాక్‌

Published : Jul 25, 2026, 07:07 PM IST

నాగార్జునకి అమ్మాయిలంటే ఇష్టం. తనకు ఆడపిల్ల పుట్టాలని చాలా కోరుకున్నారు. పుడుతుందని సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ తీరా ఆసుపత్రిలోకి వెళ్లి బెడ్‌పై పిల్లాడిని చూసి షాక్‌ అయ్యారు. మరి ఇంతకి ఏం జరిగింది?

PREV
14
ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన నాగార్జున

అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా రాణించారు. ఇప్పటికీ అదే స్టార్‌డమ్‌తో రాణిస్తున్నారు. తనకు మన్మథుడు అనే ట్యాగ్‌ వచ్చినప్పటికీ అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. యాక్షన్‌ మూవీస్‌, డివోషనల్‌ మూవీస్‌ చేశారు. అంతేకాదు మల్టీస్టారర్స్ కూడా చేశారు. ఇప్పుడు నెగటివ్‌ రోల్స్ కూడా చేసి మెప్పిస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌ `కూలీ`లో నెగటివ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరోగా తన వందవ సినిమాతో రాబోతున్నారు. మరోవైపు తన చిన్న కొడుకు అఖిల్‌ ఇటీవలే ఫస్ట్ హిట్‌ కొట్టాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది.

24
వారసుడు అఖిల్‌ హిట్‌ కొట్టాడు

అఖిల్‌ ఇటీవల `లెనిన్‌` మూవీతో హిట్‌ కొట్టాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఆయనకు విజయం వరించింది. ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్‌ అవుతుంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటింది. ప్రస్తుతం లాభాల్లో వెళ్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అఖిల్‌ పలు ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా `రా టాక్స్`లో పాల్గొన్నారు. ఇందులో తన బర్త్ కి సంబంధించిన ఆసక్తికర  విషయాన్ని వెల్లడించారు. నాగార్జున అనుకున్నదొక్కటి, ఆ తర్వాత జరిగిందొక్కటి. తనని ఆసుపత్రిలో బెడ్‌పై చూసి నాగార్జున షాక్‌ అయ్యాడట.

34
అమ్మాయి పుడుతుందని నాగార్జు సంబరాలు

అఖిల్‌ ఏం చెప్పాడంటే.. నాగార్జున.. హీరోయిన్‌ అమలని పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్‌ జన్మించాడు. అమెరికాలోని ఓ ఆసుపత్రిలో అఖిల్‌ జన్మించాడు. అయితే అక్కడ ముందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే, అమ్మాయి అని డాక్టర్లు చెప్పారట. అమెరికాలో ఈ టెస్ట్ లు చేస్తే తప్పేం కాదు. నాగార్జున చేయించారు. అమ్మాయి అని చెప్పారు.  ఆయనకు అమ్మాయి పుట్టాలని ఉంది. లక్కీగా అదే అని తెలియడంతో సంబరాలు చేసుకున్నారు. అమ్మాయి కోసం డ్రెస్సులు ముందే కొన్నారాట. బేబీకి కావాల్సిన అన్ని వస్తువులు ముందే కొనిపెట్టారట. అంతేకాదు పేరు కూడా ముందే నిర్ణయించారు. `నిఖిత` అని పేరు కూడా అనుకున్నారట.

44
అమల పక్కన అబ్బాయిని చూసి షాక్‌

మొత్తానికి డెలివరీ రోజు వచ్చింది. అంత బాగానే డెలివరీ జరిగింది. ఎలాంటి సమస్య లేదు. ఇక పుట్టిన బేబీని చూసేందుకు ఆసుపత్రిలోకి వెళ్లాడట నాగార్జున. అమల పక్కన బెడ్‌పై అమ్మాయిని చూసి షాక్‌ అయ్యాడు. ఆ అబ్బాయినే అఖిల్‌. అమ్మాయి పుడుతుందని ఆనందంలో ఉన్న ఆయనకు అఖిల్‌ రూపంలో పెద్ద షాక్‌ తగిలింది. బేబీ బాయ్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇలా జరిగిందని చూస్తే, ఆ రిపోర్ట్ లో తప్పు చూపించిందట. ఆ సమయంలో కాసేపు షాక్‌ అయి బాధపడినా, ఆ తర్వాత హ్యాపీ అయ్యాడట నాగార్జున. అలా అఖిల్‌ వారి జీవితంలో వచ్చాడు. నిఖిత కాస్త అఖిల్‌ అయిపోయాడు. ఆ అఖిలే ఇప్పుడు టాలీవుడ్‌ లో హీరోగా నిలబడ్డాడు. హిట్‌ కొటి మంచి జోరు మీదున్నాడు. అదే అమ్మాయి పుట్టి ఉంటే సినిమాల్లోకి వచ్చేది కాదేమో.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories