Varanasi: వారణాసి కలెక్షన్లు, వెయ్యి కాదు, 10000కోట్లు.. రాజమౌళి ప్లాన్‌ ఇదే, ప్రొడ్యూసర్‌ జోస్యం

Published : Jul 25, 2026, 09:28 PM IST

వారణాసి మూవీపై ప్రముఖ నిర్మాత జోస్యం చెప్పారు. ఈ చిత్రం పదివేల కోట్లు సాధిస్తుందని తెలిపారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్‌ 10 చిత్రాల్లో చోటు సంపాదిస్తుందన్నారు.

PREV
14
గ్లోబల్‌ ఫిల్మ్ గా వారణాసి

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం `వారణాసి` మూవీని రూపొందిస్తున్నారు. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. కేఎల్‌ నారాయణ దాదాపు రూ.1200కోట్ల బడ్జెట్‌తో  నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా కాదు, గ్లోబల్‌ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రారంభం నుంచి దీన్ని అంతర్జాతీయ సినిమాగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

24
వారణాసిపై రాజమౌళి అదిరిపోయే ప్లాన్‌

`వారణాసి` మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. దసరా, దీపావళి వరకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి ఏడాది చివరి వరకు పోస్ట్ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేసి వచ్చే ఏడాది నాలుగు నెలలు ప్రపంచ వ్యాప్తంగా మూవీని ప్రమోట్‌ చేసే పనిలో రాజమౌళి ఉన్నారు. ఈ సినిమాని ఎక్కువ మంది చూసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇండియాలోనే దాదాపు 140కోట్ల మంది జనాభా ఉంది. అందులో సినిమా చూసేవారి సంఖ్య కోటి, రెండు కోట్ల లోపే ఉంటుంది. అంటే కేవలం ఒక్క శాతం మందే సినిమాలను చూస్తున్నారు. ఆ పర్సెంటేజీని పెంచే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారని సమాచారం.

34
వారణాసి 10000 కోట్ల కలెక్షన్లు

సినిమా చూసేవారి ఒక్క శాతం పెరిగినా సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే రెండు వేల కోట్లు మనకు పెద్ద సమస్య కాదని తేలిపోయింది. అదే మరో ఒకటి, రెండు శాతం ప్రజలు సినిమా చూస్తే, ఈజీగా ఐదారువేల కోట్ల కలెక్షన్లు వస్తాయని చెప్పొచ్చు. అయితే `వారణాసి` మూవీ విషయంలో రాజమౌళి టార్గెట్‌ ఇంకా పెద్దగా ఉంది. ఆయన పదివేల కోట్లు టార్గెట్‌ చేశారని సమాచారం. ఈ విషయాన్ని నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. `వారణాసి` మూవీతో వెయ్యి కోట్లు కాదు, పదివేల కోట్ల కలెక్షన్లు రాబట్టేలా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారని, పది వేల కోట్ల టార్గెట్‌తో మూవీని రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ మూవీ పది వేలకోట్లు వరకు వెళ్తుందని తాను భావిస్తున్నట్టు జోస్యం చెప్పారు. అంతటి పొటెన్షియాలిటీ సినిమాకి ఉందని, అలాంటి సినిమాని రాజమౌళి రూపొందించగలరని చెప్పారు.

44
రాజమౌళి కి పిచ్చా అన్నారు

తాను వంద కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు రాజమౌళి కి పిచ్చి పట్టిందా అని తాను అనుకున్నాడట. తానే కాదు చాలా మంది అలానే అనుకున్నారట. ఐదు వందల కోట్లు పెట్టి బాహుబలి తీసినప్పుడు రాజమౌళి కి పిచ్చి అనుకున్నారట. కానీ తాను తప్పు కాదని నిరూపించారు. అదే సమయంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` విషయంలోనూ అదే నిజమని తేలింది. సినిమాని నమ్మితే కలెక్షన్లు అవే వస్తాయని రాజమౌళి నిరూపించినట్టు తెలిపారు. ఇప్పుడు మనం ఆయన్ని నమ్మాల్సిన అవసరం ఉందన్నారు. `వారణాసి` మూవీ గ్లోబల్‌ వైడ్‌గా సంచలనం సృష్టిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఈ సినిమా పది వేల కోట్లు సాధించాలని, అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన టాప్‌ 10 సినిమాల జాబితాలో చేరాలని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories